బాలయ్యతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్న పూరీ.. నటసింహం ఛాన్స్ ఇస్తారా?

టాలీవుడ్ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్( Puri Jagannadh ) ఇటీవల కాలంలో తన సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోతున్నారు.ఒకప్పుడు పూరి సినిమాలు వస్తున్నాయి అంటే ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసేవారు అంతలా ఈయన సినిమాలు ప్రేక్షకులను మెప్పించేవి కానీ ఇటీవల కాలంలో పూరి మార్క్ తన సినిమాలలో కనిపించడం లేదని తెలుస్తోంది.

 Shocking Updates About Balakrishna Puri Jagannath Details, Puri Jagannadh, Direc-TeluguStop.com

ఇక తాజాగా ఈయన రామ్ పోతినేని హీరోగా డబల్ ఇస్మార్ట్( Double Ismart ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Telugu Puri Jagannadh, Double Ismart, Purijagannadh, Ram Pothineni, Tollywood-Mo

ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది.పూరి తన సినిమాల విషయంలో ముందు ఉన్న కంటెంట్ ఇప్పుడు అందించలేకపోతున్నారని అభిమానులు కూడా ఈ విషయంపై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక డబల్ ఇస్మార్ట్ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో పూరి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే విషయంపై అందరూ ఆరా తీస్తున్నారు.

Telugu Puri Jagannadh, Double Ismart, Purijagannadh, Ram Pothineni, Tollywood-Mo

ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రం నందమూరి నటసింహం బాలయ్యతో( Nandamuri Balakrishna ) చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.నిజానికి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఇప్పటికే రావాల్సి ఉండగా పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ కాంబినేషన్లో సినిమా వాయిదా పడిందని తెలుస్తోంది.లైగర్ సినిమా తర్వాత బాలయ్యతో పూరి సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి.అయితే ప్రస్తుతం మాత్రం బాలకృష్ణ కోసం పూరి జగన్నాథ్ అద్భుతమైన కథను సిద్ధం చేశారని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విషయాలను బాలకృష్ణతో పూరి జగన్నాథ్ చర్చలు జరుపబోతున్నారని తెలుస్తుంది.

మరి పూరి జగన్నాథ్ కు బాలయ్య చాన్స్ ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.కథలో కంటెంట్ ఉంటే బాలయ్య ఏ డైరెక్టర్ కైనా అవకాశాలు ఇచ్చి వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు.

మరి పూరి జగన్నాథ్ తన సినిమా కథతో బాలకృష్ణను మెప్పించగలరా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube