వేసవికాలంలో ఎండలు బాగా ఎక్కువ అయిపోవడంతో తిరుమలలో వేసవి రద్దీ క్రమంగా పెరుగుతుంది.అయితే వేసవికాలం అయినప్పటికీ కూడా తిరుమల( Tirumala )లో భక్తులు భారీగా తరలివస్తున్నారు.
అయితే శ్రీవారి దర్శనానికి వెళ్లాలని అనుకుంటున్నా భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్ చెప్పింది.అయితే తిరుపతి టూర్ ప్యాకేజీ బుక్ చేసుకుంటే ప్రత్యేక దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తామని తెలిపింది.
అలాగే స్కూళ్లకు కాలేజీలకు సెలవు రాగానే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకున్న భక్తులందరి కోసం ఐఆర్సిటిసి టూరిజం( IRCTC Package ) ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.అయితే ఐఆర్సిటిసి విజయ్ గోవిందం( Vijay Govindam ) అనే పేరుతో టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తుంది.
ఇందులో రెండు రాత్రులు, మూడు రోజుల టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంచింది.ఇక హైదరాబాద్ నుంచి ప్రతి రోజు ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
ఇక ఈ ప్యాకేజీని బుక్ చేసుకున్న భక్తులందరికీ తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉచితంగా కల్పిస్తోంది.

అలాగే ఈ ప్యాకేజీలో తిరుచానూరులో పద్మావతి అమ్మవారి( Padmavathi Temple ) దర్శనం కూడా చేసుకోవచ్చు.అలాగే ఐఆర్సిటిసి తిరుపతి ప్యాకేజీలు మొదటి రోజు హైదరాబాద్ నుంచి రైలు బయలుదేరడం జరుగుతుంది.ఇక ఎక్స్ప్రెస్ ట్రైన్ సాయంత్రం 5:25 గంటలకు లింగపల్లికి బయలుదేరుతుంది.ఇక ఇటు ప్యాకేజీ బుక్ చేసుకున్న ప్రయాణికులకు 6:10 గంటలకు సికింద్రాబాద్లో అలాగే రాత్రి 7:30 గంటలకు నల్గొండలో ప్రయాణికులు ఈ రైలు ఎక్కవచ్చు.ఇక రెండో ఉదయం ఈ రైలు తిరుపతికి చేరుకుంటుంది.
ఇక హోటల్ లో ఫ్రెష్ అయిన తర్వాత ఉదయం 9 గంటలకు తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశన దర్శనం కల్పిస్తారు.

ఇక భక్తులు శ్రీవారిని ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా దర్శించుకుంటారు.ఇక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తిరుచానూర్ పద్మావతి అమ్మవారి దర్శనానికి బయలుదేరుతారు.అక్కడ పద్మావతి అమ్మవారి దర్శనం అయ్యాక పర్యాటకులను అదే రోజు సాయంత్రం తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద డ్రాప్ చేస్తారు.
ఇక సాయంత్రం 6:25 గంటలకు ట్రైన్ ఎక్కితే మూడో రోజు తెల్లవారుజామున 5:35 గంటలకు సికింద్రాబాద్( Secunderabad )చేరుకుంటారు.ఇక ఆ తర్వాత లింగపల్లికి 6:55 గంటలకు రైలు చేరుకుంటుంది.