ఈ రోజును యమ ద్వితీయ, భాయిదూజ్‌గా జరుపుకుంటారు.యవరాజు ఆ రోజున తన సోదరి యమి ఇంటికి వెళ్లాడు.
ఆమె అతడి నుదుటిపై పవిత్ర తిలకం దిద్దింది.పూలమాల వేసి ప్రత్యేక వంటలు వడ్డించింది.
ఇద్దరూ మిఠాయిలు తిన్నారు.యమరాజు వెళ్లిపోతూ తన సోదరికి ఓ వరమిచ్చాడు.
ఆ ప్రత్యేక రోజున యమిని ఎవరు సందర్శిస్తే వారి పాపాలన్ని పోతాయని, మోక్షం కలుగుతుందని చెప్పాడు.నాటి నుంచీ ఆ రోజును సోదర-సోదరీమణుల ప్రేమ చిహ్నంగా భావిస్తూ పండుగ చేసుకుంటున్నారు.
హిందీ ప్రాంతాల్లో ఆ పండుగను ‘భయ్యా-దుజ్‌గా మరాఠీ మాట్లాడే ప్రాంతాల్లో నేపాల్లో దీన్ని ‘భాయి-టికాగా పాటిస్తున్నారు.
వివాహానంతరం కూడా అన్నా చెల్లెళ్ల మధ్య అనురాగం అలాగే వుండటం కోసం మన పెద్దలు ఆచారం అనే జాబితాలో ఎన్నో అంశాలను చేర్చారు.అత్తవారింటికి వెళ్లిన ఆడపిల్ల బాగోగులు సోదరులు తెలుసుకోవాలనీ … అవసరమైతే అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే ఆడపిల్ల ఇంట జరిగే ప్రతి శుభకార్యంలో మేనమామ ప్రధాన పాత్రను పోషించేలా చేశారు.
మేనకోడలికి చెవులు కుట్టించడం దగ్గర నుంచి ….వివాహ సమయంలో పెళ్లి కూతురిగా బుట్టలో వేదికపైకి తీసుకు వచ్చేంత వరకూ మేనమామగా తన వంతు పాత్రను పోషించేలా చేశారు.అలాగే ఆడపిల్ల కూడా పుట్టింటి వారిని మరిచిపోకుండా వుండటం కోసం … ఆ కుటుంబంలో తాను ఎప్పటికీ ఓ సభ్యురాలినేననే విషయాన్ని గుర్తించేలా ఆమె జోక్యాన్ని ఏర్పరిచారు.
ఈ కారణంగానే పుట్టింటి వారు ఏ శుభాకార్యాన్నయినా ఆడపిల్ల చేతుల మీదుగా జరిపించాలనే ఆచారాన్ని ప్రవేశ పెట్టారు.
ప్రతి ఆడపిల్ల కూడా సోదరుడి వివాహానికి అందరి కంటే ముందుగా వచ్చి పెళ్లి పనులు చక్కబెడుతుంది.ప్రేమానురాగాలు పంచడంలో తన తరువాతే ఎవరైనా అనేలా, సోదరుడిని పెళ్లి కొడుకుగా అలంకరిస్తుంది.ఆడపిల్లగా తనకి పుట్టినింటి పై ఎప్పటికీ హక్కు వుంటుందన్నట్టుగా, తనకి రావలసిన లాంఛనాలను అధికారికంగా తీసుకుంటుంది.
ఒకవేళ పుట్టింటి వారి పరిస్థితి బాగోలేకపోతే, వారికి అన్నివిధాలుగా ఆసరాగా నిలబడటానికి కూడా ఆమె ఎట్టి పరిస్థితుల్లోను వెనుకాడదు.
DEVOTIONAL