చాలామంది తమ ఇంట్లో విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు.అయితే మరికొందరు బుద్ధుడి విగ్రహాలను కూడా పెట్టుకుంటుంటారు.
అయితే బుధుడు విగ్రహాల్లో( Buddha Statue ) చాలా రకాలు ఉన్నాయి.కొన్ని రూపాల విగ్రహాలు ఇంట్లో పెట్టుకుంటే మంచిదేనా లేదా చెడ్డదా అన్న సందేహాలు చాలామందికి ఉంటాయి.
అయితే బుద్ధుని విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకునే ముందు కొన్ని నియమాలను పాటించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.ఈ విధంగా సరైన నియమాలను పాటించి ఇంటికి బుద్ధ విగ్రహాన్ని తెచ్చుకోవడం మంచిదని చెబుతున్నారు.
గౌతమ బుద్ధుడు సామరస్యం, ఆత్మబలానికి, జ్ఞానానికి చిహ్నం.

ఇక వాస్తు ప్రకారం ఇంట్లో కుడి మూలన బుద్ధుని విగ్రహం పెట్టుకోవడం చాలా మంచిది.దీని వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.ఇక ధ్యాన భంగిమలో ఉన్న బుద్ధుని విగ్రహం ఇంట్లో ఉంటే శాంతిని ఇస్తుంది.
ఇక ధ్యానం చేసుకునే చోట ఈ విగ్రహాన్ని పెట్టుకోవాలి.లేదా గార్డెన్లో కానీ విశ్రాంతి తీసుకునే చోట గాని ఈ విగ్రహాన్ని పెట్టుకోవాలి.
ఎందుకంటే ధ్యాన బుద్ధుడి( Dhyana Buddha )ని చూసినప్పుడు తెలియకుండానే ఒక రకమైన శాంతి భావన కలుగుతుంది.ఇక బాల్కనీ లేదా తోటలో కూడా బుద్ధుని విగ్రహం పెట్టుకుంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది.

అంతేకాకుండా ఆ బుద్ధుని విగ్రహం పక్కన ఓ పూల మొక్కలను కూడా అలంకరించుకోవడం చాలా మంచిది.దీనివల్ల మానసికంగా చాలా ప్రశాంతత కలుగుతుంది.ధ్యాన బుద్ధుడి విగ్రహం తోటలో పెట్టుకోవచ్చు.అంతేకాకుండా కుడి చేతిని తలకింద పెట్టుకొని పడుకున్నా భంగిమలో ఉన్న బుధుడు జ్ఞానం, ముక్తికి ప్రతీక.అందుకే ఇలాంటి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే శాంతి ఉంటుంది.అలాగే ఈ విగ్రహాన్ని పడమర దిక్కు( West direction )కు ముఖం ఉండేలా పెట్టుకోవడం చాలా మంచిది.

దీని వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది.బుద్దుడు విగ్రహాన్ని ఎప్పటికైనా ఎదురుగా లేదా తలపైకెత్తి చూసే విధంగా పెట్టుకోవాలి.కళ్ళు దించి చూసే విధంగా బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోవడం మంచిది కాదు.
అలాగే కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు మన కాళ్లు బుద్ధుని వైపు ఉండకుండా చూసుకోవడం మంచిది.అలాగే బుద్ధుడి విగ్రహం చుట్టూ చెత్త చెదారం కూడా ఉండకూడదు.ఎప్పుడు ఆ బుద్ధుడి విగ్రహాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.అలాగే ఆ ప్రదేశాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి.
LATEST NEWS - TELUGU