అది ఏ సంవత్సరమైనా కావచ్చు, ఏ నెలైనా కావచ్చు పుట్టింది మాత్రం 15వ తేదీ అయితే చాలు.వాళ్లకు ఎలాంటి లక్షణాలు ఉంటాయో సంఖ్యా శాస్త్రం ప్రకారం ఇప్పుడు తెల్సుకుందాం.
ఒకటి కి అధిపతి సూర్యుడు.ఐదు కి అధిపతి బుధుడు.
ఈరెండు కలిపితే వచ్చే ఇక సంఖ్య 6కి అధిపతి శుక్రగ్రహం.మొత్తమ్మీద 15వ తేదీన జన్మించిన వ్యక్తులు శుక్ర గ్రహ ఆధీనంలో వుంటారు.
వీళ్ళు ఏ రంగం లో వున్నా సరే,ప్రతిభతో రాణిస్తారని సంఖ్యా శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇక 15న జన్మించిన వారి ఆకారం, రూపం , డ్రెస్ కోడ్ చూసిన వెంటనే పదిమందిని ఆకర్షించేలా ఉంటాయి.
అందరిలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు.కళా హృదయం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది.
ప్రతీది క్రియేటివ్ గా ఆలోచన చేసి,అమలు చేసుకోవడం వలన సునాయాసంగా విజయాలు నమోదు చేసుకుంటారు.
వీరికి చక్కని వాక్చాతుర్యం భగవంతుడు ఇచ్చిన వరంగా చెప్పవచ్చు.పదిమందినీ ఒప్పించడంలో మేటిగా వుంటారు.ఐశ్వర్యం దానంతట అదే వరిస్తుంది.
ఎదుటి వ్యక్తి దగ్గరకు వెళ్లి అడగకుండానే వీరిని వెదుక్కుంటూ వస్తాయి.చిన్న కుటుంబంలో జన్మించినా సరే, ఏ వృత్తిలో ఉన్నాసరే, తక్కువ సమయంలో పెద్దస్థాయికి వెళ్తారు.
ఏదైనా చర్చ పెడితే, 15వ తేదీన జన్మించిన వాళ్ళు రాణిస్తారు.ఒకవేళ తెలియక పొతే సున్నితంగా తప్పుకునే ప్రయత్నం చేస్తారు.వేరే వాళ్ళను కలవమని చెబుతారు.ఏదైనా నేర్చుకోవాలంటే,వెంటనే నేర్చేసుకుంటారు.
బుద్ధి కుశలత ఉంటుంది.ఇక కొన్ని వ్యసనాల్లో కూరుకు పోవడం,ఇంద్రియ నిగ్రహం కోల్పోవడం వలన జీవితంలో కిందికి దిగజారిపోతారని నిపుణులు చెబుతున్నారు.
అందుకే చెడు కోరికలను నిగ్రహించుకోవాలి.
DEVOTIONAL