పంచ మహా యజ్ఞాలు అంటే ఏమిటో తెలుసా?

పంచ మహా యజ్ఞాలు అనగా ఐదు రకాల యజ్ఞాలు.అయితే అవి బ్రహ్మ యజ్ఞం, దేవ యజ్ఞం, పితృ యజ్ఞం, భూత యజ్ఞం, నృయజ్ఞం.

 Do You Know Pancha Maha Yagnalu Pancha Maha Yagnalu, Pooja, Devotional, Brahma Y-TeluguStop.com

హిందూ ధర్మ శాస్త్రాల నుంచి ఈ పంచ మహా యజ్ఞాలు ఎలా ఆచరించ వచ్చో మన పూర్వ వేద పండితులు తెలిపారు.అందులో మొదటిది బ్రహ్మ యజ్ఞం.

ఈ యజ్ఞం ద్వారా గృహస్తుడు అనేక కొత్త విషయాలను తెలుసుకుంటాడు.అలాగే మిగిలిన వారికి కూడా తెలియజేస్తాడు.

బ్రహ్మ యజ్ఞం అనగా  వేదాధ్యయనం. రామాయణ, భాగవత గ్రంథాలను పఠించడమే ఈ బ్రహ్మ యజ్ఞం.

రెండోది దే వ యజ్ఞం.ఇవి భగవంతుడి అనుగ్రహం కోసం.ఇష్ట ర్య సిద్ధి సం చేస్తారు.దేవ యజ్ఞం అనగా ఆజ్యం, లాజలు వంటి వాటితో హోమం జరిపించుట.

పితృ యజ్ఞం.ఇవి తమను వదిలి పరలోకానికి వెళ్లిన తమ పితృ దేవతల కోసం చేస్తారు.

అయితే తండ్రి బ్రతికి ఉండగా ఇట్టి యజ్ఞం చేసేందుకు కుమారులకు అనుమతి లేదు.అలాగే నాలుగోది భూత యజ్ఞం.

తనతో పాటుగా ఈ భూమి మీద ఉన్న సకల చరాచర జీవ రాశులకు ఉపయోగపడేలా తాను నడుచుకోవాలి.భూత యజ్ఞం అనగా సకల భూతాలకు బలి దానాలు ఇచ్చుట.

నృయజ్ఞం.ఈ యజ్ఞమునే అతిథి యజ్ఞం అని కూడా పిలుస్తారు.మన ఇంటికి వచ్చిన అతిథిని గౌరవంగా చూసుకోవాలి.ఈ యజ్ఞం ద్వారానే గృహస్తుడు మిగిలిన మూడు ఆశ్రముల వారికి ఆధారం అవుతున్నాడు.నృయజ్ఞం అనగా అతిథి పూజాదులు నిర్వర్తించడం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube