సాధారణంగా ఎంతోమంది మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు, జ్యోతిష్య శాస్త్రాన్ని వాస్తు శాస్త్రాన్ని కూడా ఎక్కువగా నమ్ముతారు.ఈ క్రమంలోనే వారు చేపడుతున్న ఏ కార్యక్రమంలో నైనా ఆటంకాలు ఎదురైతే వెంటనే వాస్తు శాస్త్ర నిపుణులను, లేదా జ్యోతిష్య శాస్త్ర నిపుణులను సంప్రదించి వారి సమస్యకు పరిష్కార మార్గాలను అడుగుతారు.
ఈ విధంగా చాలామందికి ఇంట్లో ఎదురయ్యే సమస్యలకు కర్పూరం ఒక చక్కటి పరిష్కార మార్గం అని చెప్పవచ్చు.కర్పూరంతో వివిధ రకాల దోషాలను కూడా తొలగించుకోవచ్చుని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
కొన్ని సార్లు కొంత మంది తరచూ ప్రమాదాలకు గురవుతుంటారు.ఈ క్రమంలోనే ఇలా ప్రమాదాలకు గురవుతుంటే వారికి లేదా తమ కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని ఖంగారు పడుతుంటారు.
ఈ విధంగా ప్రమాదాలు తలెత్తినప్పుడు వాటి నుంచి బయటపడటం కోసం కర్పూరం, లవంగాలను తమలపాకులో చుట్టి కాళీమాతకు సమర్పించడం వల్ల ప్రమాద దోషాలు తొలగిపోతాయి.అదే విధంగా చాలా మంది యువతీ యువకులు సరైన సమయంలో పెళ్లిళ్లు జరగక ఎంతో ఇబ్బంది పడుతుంటారు.
ఇలా వచ్చిన సంబంధాలన్ని కుదరక పోవడానికి గల కారణం జాతక దోషాలని చెప్పవచ్చు.ఈ విధంగా పెళ్ళికాని యువతీ యువకులు పసుపు కర్పూరాన్ని దుర్గామాతకు సమర్పించి పూజ చేయటం వల్ల జాతక దోషాలు తొలగిపోయి పెళ్లి సంబంధాలు కుదురుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఇక ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు, ఎంత సంపాదిస్తున్నా చేతిలో డబ్బు నిలవకుండా ఉన్నవారు కర్పూరాన్ని వెలిగించి అందులో నాలుగు లవంగాలను కాల్చాలి.ఈ విధంగా కాల్చిన వాటిని రాత్రి నిద్రపోయే ముందు వాటిని ఇంటి బయట పడేయటం వల్ల మనకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన సంపాదన కూడా మిగులుతుంది.కర్పూరానికి నెగిటివ్ ఎనర్జీ తగ్గించే గుణం ఉండటం వల్ల ప్రతి కార్యంలో ఈ కర్పూరాన్ని ఉపయోగించడమే కాకుండా పూజా కార్యక్రమాలలో, కర్పూర హారతులను ఇస్తుంటారు.