మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.హిందూ గ్రంధాల ప్రకారం రోజువారి జీవితానికి ఎన్నో నియమాలు కూడా ఉన్నాయి.
వీటిలో మహాభారతం, విష్ణు పురాణం, వామన పురాణం, స్కంద పురాణం, వశిష్ట వంటి అనేక గ్రంథాలలో పేర్కొన్న ఆహార నియమాలు ఉన్నాయి.ఈ నియమాలకు విరుద్ధంగా ఉంటే మీ ఆహారం ప్రతికూల శక్తుల కు సమానమని గ్రంధాలలో ఉంది.
మనం భోజనం చేయడానికి సరైన దిశ ఏంటి, ఏ దిశలో కూర్చుని భోజనం చేయా లో ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేసేటప్పుడు మనం ఏ దిశలో కూర్చుంటాము.
అనేదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.చేతులు కాళ్లు కడుక్కున్న తర్వాత ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టి భోజనం చేయాలి.
అంతే కాకుండా ఎప్పుడు తూర్పు, ఉత్తర దిక్కులు చూస్తూ భోజనం చేయాలి అని అర్థం.దక్షిణ, పడమర వైపున కూర్చుని భోజనం చేయకూడదు.
ఎందుకంటే వామన పురాణం ఇలా చెబుతోంది.దక్షిణ ముఖంగా కూర్చుని భోజనం చేయకూడదు.

ఇలా చేయడం వల్ల రాక్షస ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతుంది.అలాగే పడమర ముఖంగా ఉండే ఆహారం తీసుకుంటే రోగాలు వస్తాయని చెబుతున్నారు.దక్షిణ వైపు పాదరక్షకాలతో భోజనం చేసే వ్యక్తి తన ఆహారాన్ని భూతంగా పరిగణించాలి.భోజనం చేసేటప్పుడు తలపై ఎలాంటి వస్త్రం ధరించకూడదని, చెప్పులు వేసుకుని భోజనం చేయకూడదని మహాభారతంలో ఉంది.

ఇంకా చెప్పాలంటే చేతులు, పాదాలు కడుక్కోకుండా దక్షిణాభిముఖంగా తల పై గుడ్డ కట్టుకొని భోజనం చేసేవారి ఆహారాన్ని ప్రేతాత్మలు తింటాయని మహాభారతంలో ఉంది.అంతేకాకుండా తూర్పు, ఉత్తరం వైపున ఉన్న ఆహారాన్ని తినడం వల్ల మనిషికి గొప్ప ఐశ్వర్యం, ఆయుష్షు లభిస్తుందని పద్మ పురాణంలో తెలిపారు.