యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన అదుర్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం తన లుక్ ను మార్చుకోవడంతో పాటు డ్యూయల్ రోల్ లో అద్భుతంగా నటించి మెప్పించారు.ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కు మంచి పేరును తెచ్చిపెట్టింది.
2010 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఆ సంవత్సరం విడుదలైన బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది.ఈ సినిమాలో ఒక పాత్రలో బ్రాహ్మణుడిగా నటించిన తారక్ ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.ఈ సినిమాలో బ్రాహ్మణుడి పాత్రలో తారక్ చెప్పిన డైలాగ్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మరోవైపు నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక జర్నలిస్ట్ బ్రాహ్మణులలా నడవడం నేర్చుకున్నానని బ్రాహ్మణులలా మాట్లాడటం నేర్చుకున్నానని నాగశౌర్య చెబుతున్నారని అంటే బ్రాహ్మణులు మనుషులలో ఒకరు కాదా అని ప్రశ్నించారు.ఇదే ప్రశ్నను జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ సినిమాలో నటించిన సమయంలో మీరు ఎందుకు అడగలేదని నాగశౌర్య జర్నలిస్ట్ పై సీరియస్ అయ్యారు.పుష్ప సినిమా కోసం బన్నీ చిత్తూరు యాస నేర్చుకున్నాడని భాషతో మెప్పించాలనే ఆలోచనతో బన్నీ అలా చేశాడని నాగశౌర్య అన్నారు.

నేను కూడా అంతేనని బ్రాహ్మణ కుర్రాడి పాత్ర పోషిస్తే సరిపోదని భాషతో కూడా మెప్పించాలనే ప్రయత్నం చేశానని నాగశౌర్య అన్నారు.వాళ్ల నడవడికలు, భాషను ఫాలో అయితే మాత్రమే పాత్రకు న్యాయం చేసినట్లు అవుతుందని నాగశౌర్య చెప్పుకొచ్చారు.హీరో నాగశౌర్య వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







