రాత్రుళ్లు ఈ ఫుడ్స్ తింటే చెడు క‌ల‌లు వ‌స్తాయ‌ట‌..జాగ్ర‌త్త‌!

చెడు క‌ల‌లు లేదా బ్యాడ్ డ్రీమ్స్‌.దాదాపు అంద‌రూ ఎప్పుడోక‌ప్పుడు వీటిని ఫేస్ చేసే ఉంటారు.

 Eating These Foods At Night Can Lead To Bad Dreams! Bad Dreams, Foods, Night, Dr-TeluguStop.com

చెడ్డ‌ క‌ల రాగానే కొంద‌రు ఏదో చెడు జ‌ర‌గ‌బోతోంద‌ని తెగ భ‌య‌ప‌డిపోతూ ఉంటారు.ఈ క్ర‌మంలోనే తీవ్ర ఆందోళ‌న‌కు గురై ఒత్తిడిని పెంచేసుకుంటారు.

అయితే చెడు క‌ల‌లు రావ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి.వాటిలో ఫుడ్స్ కూడా ఒక‌టి.

అవును, రాత్రుళ్లు కొన్ని కొన్ని ఆహారాలు తీసుకోవ‌డం వ‌ల్ల కూడా చెడు క‌ల‌లు వ‌స్తూ ఉంటాయి.మ‌రి లేటెందుకు ఆ ఆహారాలు ఏంటో చూసేయండి.

సోడా.చాలా మంది రాత్రి భోజ‌నం త‌ర్వాత దీనిని తీసుకుంటారు.కానీ, రాత్రి వేల సోడా తీసుకుంటే.నిద్రలో ఉన్నప్పుడు చెడు కలలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.అదే స‌మ‌యంలో నిద్ర‌కు తీవ్ర ఆటంకాన్ని పెంచుతుంది.అందుకే సోడాను తీసుకోవ‌డం మానేయాలి.సోడా మాత్ర‌మే కాదు.ఆల్క‌హాల్‌, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్‌, ఐస్ క్రీమ్ వంటివి తీసుకున్నా అలానే జ‌రుగుతుంది.

అలాగే బ్రెడ్‌ను చాలా మంది డిన్న‌ర్‌గా తీసుకుంటారు.కానీ, బ్రెడ్‌లో ఉండే పిండి పదార్ధాలు నిద్ర‌కు భంగం కలిగించి.పీడ కలల ప్రమాదాన్ని పెంచుతుంది.అందుకే రాత్రుళ్లు బ్రెడ్‌ను ఎవైడ్ చేయాలి.

పాస్తా, కుక్కీలు, కేకులు, బ‌న్నులు, బ‌ర్గ‌ర్లు, మైదా ఆహారాల్లోనూ పిండి ప‌దార్థాలు ఎక్కువ‌గానే ఉంటాయి.కాబ‌ట్టి, రాత్రి వేళ వీటికి సైతం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Telugu Bad Dreams, Dreams, Foods, Tips, Latest-Telugu Health - తెలుగ

ఇక రాత్రి వేళ‌ల్లో స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే శరీరం లోపల కొన్ని రకాల ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుంది.ఫలితంగా పీడ‌ల క‌ల‌లు వ‌చ్చే రిస్క్ పెరుగుతుంది.అందుకే స్పైసీ ఫుడ్స్‌ను నైట్ తీసుకోవ‌డం మానుకోవాలి.ఇక ఆకుకూర‌లు, పాలు, పాల ఉత్ప‌త్తులు, సాస్‌లు, క్రిస్పీ చిప్స్ వంటి ఆహారాలు తిన‌డం వ‌ల్ల సైతం చెడు క‌ల‌లు వ‌స్తుంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube