గర్భనిరోధక మాత్రల వలన కలిగే నష్టాలు

కండోమ్ వాడటం వలన సెక్స్ అనుభవంలో మార్పు వస్తుందని కొందరు, అసలు కండోమ్ వాడాల్సిన అవసరం ఏముందని కొందరు, భాగస్వామి బలవంతం మీద ఇంకొందరు మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు.వీటి వలన లాభాలు పూర్తిగా లేవు అని కాదు కాని, నష్టాలు మాత్రం చాలానే ఉన్నాయి.

 Disadvantages Of Birth Control Pills-TeluguStop.com

* గర్భనిరోధక మాత్రలు వాడటం వలన కలిగే అతి సాధారణమైన ఇబ్బందుల్లో ఒకటి తలనొప్పి.అసలు ఇంతకుముందు పెద్దగా పలకరించకపోయినా, చాలామందిలో గర్భనిరోధక మాత్రల వలన తలనొప్పి మాటిమాటికి వచ్చిపోయే చుట్టమైపోతుంది.

* కండోమ్ కి బదులుగా గర్భనిరోధక మాత్రలను ఆశ్రయిస్తే, హై బిపి వచ్చే అవకాశాలు బాగా పెరిగిపోతాయి.

* గర్భనిరోధక మాత్రలు హార్మోన్స్ విడుదలలో తీసుకొచ్చే మార్పుల వలన మూడ్ స్వింగ్ సమస్య ఇంకా పెరిగిపోవచ్చు.

* 35 ఏళ్ళు దాటిన మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడటం అంతమంచి విషయం కాదు.ముఖ్యంగా పొగత్రాగే అలవాటు ఉంటే అది ఇంకా ప్రమాదకరం.

హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి.

* మరో ప్రమాదం ఏంటంటే, గర్భనిరోధక మాత్రలు తరుచుగా వాడే మహిళల కాళ్ళలో, ఊపిరితిత్తులలో బ్లడ్ క్లాట్ అయ్యే ప్రమాదం పెరిగిపోతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

డిసోజెస్ట్రాల్, సైప్రోటిరోన్ కలిగిన మాత్రలు ఈ ప్రమాదాన్ని ఇంకా పెంచుతాయి.

* గర్భనిరోధక మాత్రలు యోనిని కొన్నిరకాల ఇంఫెక్షన్స్ కి గురిచేయవచ్చు.

అంతేకాదు, ఇవి STD’s ని ఆపలేవు.

* ఇవిమాత్రమే కాదు, శృంగారంలో ఆసక్తి తగ్గడం, నొప్పి పెరగడం, డిప్రేషన్, వాంతులు, బరువు పెరగటం, కళ్ళలో మంట లాంటి సమస్యలు కూడా మోసుకొస్తాయి గర్భనిరోధక మాత్రలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube