తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ( Congress Party )పొత్తు విషయంలో వామపక్ష పార్టీ ఇంకా ఒక క్లారిటీకి రాలేదు.ముఖ్యంగా సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ వైఖరి పై సిపిఐ, సిపిఎం పార్టీలు ( CPI CPM parties )తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.
తమ రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకారం తెలిపినా, తాము కోరిన సీట్లు కాకుండా ఇతర నియోజకవర్గాల్లో ఆ సీట్లను కేకయించే అవకాశం ఉండడం పై వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి .ముఖ్యంగా పాలేరు అసెంబ్లీ సీటు విషయంలో కాంగ్రెస్ వైఖరి పై సిపిఎం ( CPI )మండిపడుతోంది. ఈ సీటును పొత్తులో భాగంగా వదులుకునేందుకు కాంగ్రెస్ ఇష్టపడడం లేదు.అయినా పాలేరు అసెంబ్లీ సీట్లు తమకు కేటాయించాల్సిందేనని సిపిఎం పట్టుబడుతోంది.

వాస్తవంగా ఈ సీటుపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ( Tummala Nageswara Rao )ఎప్పటి నుంచో అసలు పెట్టుకున్నారు .ఈ సీటు నుంచి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో ఆయన చేరారు .అయితే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivas Reddy )సైతం కాంగ్రెస్ లో చేరడంతో , ఆయన కూడా పాలేరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉండడం తో ఈ సీటు విషయంలో ఈ ఇద్దరు నేతలనే తేల్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించడంతో, ఖమ్మం అసెంబ్లీ నుంచి తుమ్మల నాగేశ్వరావు , పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు.

అయితే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం( Tammineni Veerabhadram ) పాలేరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు .ఈ మేరకు ఆ సీటును పొత్తులో భాగంగా తమకు కేటాయించాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు.పాలేరు సీటు కాదంటే కాంగ్రెస్ తో పొత్తు నుంచి తప్పుకునేందుకు కూడా వెనకడేది లేదు అన్నట్లుగా సిపిఎం హెచ్చరిస్తోంది.
దీంతో ఈ సీటు విషయమై చర్చించేందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి చర్చించినట్లు సమాచారం.







