‘ పాలేరు ‘ మాకు కేటాయించాల్సిందే !

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ( Congress Party )పొత్తు విషయంలో వామపక్ష పార్టీ ఇంకా ఒక క్లారిటీకి రాలేదు.

ముఖ్యంగా సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ వైఖరి పై సిపిఐ,  సిపిఎం పార్టీలు ( CPI CPM Parties )తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.

తమ రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకారం తెలిపినా,  తాము కోరిన సీట్లు కాకుండా ఇతర నియోజకవర్గాల్లో ఆ సీట్లను కేకయించే అవకాశం ఉండడం పై వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి .

ముఖ్యంగా పాలేరు అసెంబ్లీ సీటు విషయంలో కాంగ్రెస్ వైఖరి పై సిపిఎం ( CPI )మండిపడుతోంది.

  ఈ సీటును  పొత్తులో భాగంగా వదులుకునేందుకు కాంగ్రెస్ ఇష్టపడడం లేదు.అయినా పాలేరు అసెంబ్లీ సీట్లు తమకు కేటాయించాల్సిందేనని సిపిఎం పట్టుబడుతోంది.

"""/" /  వాస్తవంగా ఈ సీటుపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ( Tummala Nageswara Rao )ఎప్పటి నుంచో అసలు పెట్టుకున్నారు .

ఈ సీటు నుంచి పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో ఆయన చేరారు .

అయితే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Ponguleti Srinivas Reddy )సైతం కాంగ్రెస్ లో చేరడంతో , ఆయన కూడా పాలేరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి  చూపిస్తూ ఉండడం తో ఈ సీటు విషయంలో ఈ ఇద్దరు నేతలనే  తేల్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించడంతో,  ఖమ్మం అసెంబ్లీ నుంచి తుమ్మల నాగేశ్వరావు , పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు.

"""/" /  అయితే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం( Tammineni Veerabhadram ) పాలేరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు .

ఈ మేరకు ఆ సీటును పొత్తులో భాగంగా తమకు కేటాయించాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు.

పాలేరు సీటు కాదంటే కాంగ్రెస్ తో పొత్తు నుంచి తప్పుకునేందుకు కూడా వెనకడేది లేదు అన్నట్లుగా సిపిఎం హెచ్చరిస్తోంది.

  దీంతో ఈ సీటు విషయమై చర్చించేందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి చర్చించినట్లు సమాచారం.

.