1. పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు

తెలంగాణలో త్వరలోనే సిఈసి ఎన్నికల తేదీ ప్రకటిస్తుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
2.అసెంబ్లీ రద్దు చేయాలంటూ సవాల్
సీఎం కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సవాల్ విసిరారు.
3.మంత్రులకు కెసిఆర్ ఫోన్

తెలంగాణలో భారీగా కురుస్తున్న వర్షాలపై సోమవారం సీఎం కేసీఆర్ ఆరా తీశారు రాష్ట్రంలోని పల్లి జిల్లాలకు చెందిన మంత్రులు ప్రజాప్రతినిధులకు కేసిఆర్ నేరుగా ఫోన్ చేసి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
5.వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది.ఈ ప్రభావంతో రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడనుందని అధికారులు తెలిపారు.
6.సీఎం రమేష్ సవాల్

సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ సీఎం రమేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.కేసుల భయంతోనే బిజెపిలో చేరినట్లు కేసిఆర్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని, ఎటువంటి కేసులు తనపై లేవని, నిరూపిస్తే దేనికైనా సిద్ధమని రమేష్ సవాల్ విసిరారు.
7.దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైలు రద్దు
భారీ వర్షాలు నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 10 రైళ్లు రద్దయ్యాయి .మరో రెండు రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి.
8.హైదరాబాద్ లో ఎంఎంటిఎస్ రైళ్ల రద్దు

హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎంఎంటీఎస్ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.నేటి నుంచి మూడు రోజులపాటు 34 ఎంఎంటిఎస్ రైళ్ల సర్వీసులను నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
9.బండి సంజయ్ మౌన దీక్ష ప్రారంభం
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మోహను దీక్ష ప్రారంభమైంది.పోడు భూములు, గిరిజన సమస్యపై జిల్లాలోని తమ కార్యాలయంలో దీక్ష చేపట్టారు.
10.భద్రాచలంలో ముంపు బాధితుల కోసం ఐదు పునరాశి కేంద్రాలు

భద్రాచలంలో ముంపు బాధితుల కోసం ఐదు పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
11.బి టి పి ఎస్ లో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బి టి పి ఎస్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.బొగ్గు కొరతతో రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని అధికారులు నిలిపివేశారు.
12.భద్రాద్రి వద్ద గోదావరి ఉధృతి రెండో ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరి ఉధృతి నేపథ్యంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
13.జగన్ విశాఖ పర్యటన వాయిదా

వర్షాల కారణంగా ఏపీ సీఎం జగన్ రేపటి విశాఖపట్నం పర్యటన వాయిదా పడింది.
14.ఎమ్మెల్యే జగ్గిరెడ్డితో ఏలూరు రేంజ్ డీఐజీ చర్చలు
అంబేత్కర్ ఫోటోతో ఉన్న పేపర్ ప్లేట్ ల వివాదం పై రావులపాలెం పోలీస్ స్టేషన్ లో నిరసన చేస్తున్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డి తో ఏలూరు రేంజ్ డీఐజీ పాల్ రాజ్ చర్చలు జరిపారు.దీంతో ఎమ్మెల్యే తన దీక్ష విరమించుకున్నారు.
15.నారా లోకేష్ డిమాండ్
టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కు భద్రతను తొలగించడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే ఆయనకు భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
16.అమర్నాథ్ యాత్ర లో విషాదం

అమర్నాథ్ యాత్రలో విషాదం నెలకొంది.రాజమండ్రీ కి చెందిన గునిసెట్టి సుధ (48) అనే మహిళ వరదల్లో గల్లయ్యంతయిన వార్త ఆలస్యంగా వెలుగు చూసింది.
17.కోవిడ్ నిధులను పక్కదారి పట్టించడంతో సుప్రీం లో విచారణ
ఏపీలో కోవిడ్ నిధులను పక్కదారి పట్టించిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
18.ముందస్తు ఎన్నికల ప్రచారం అవాస్తవం :జేడీ

దేశవ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారంలో వాస్తవం లేదని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.
19.దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేత
దుర్గ గుడి ఘాట్ రోడ్ ను అధికారులు మూసివేశారు.భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
20.శ్యాకంబరి ఉత్చావాలు ప్రారంభం
ఇంద్రకీలాద్రి పై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరీ ఉత్ర్చవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి.
.