వర్షాకాలంలో మష్రూమ్స్ ని మిస్ అయ్యారో చాలా నష్టపోతారు.. జాగ్రత్త!

మష్రూమ్స్.వీటిని తెలుగులో పుట్టగొడుగులు( mushrooms ) అని అంటారు.ప్రస్తుత వర్షాకాలంలో ఇవి విరివిరిగా లభ్యమవుతుంటాయి.వర్షాకాలంలో మష్రూమ్స్ ను అస్సలు మిస్ అవ్వకూడదు.ఒకవేళ అయ్యారో చాలా నష్టపోతారు.మష్రూమ్స్ లో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి.

 Wonderful Health Benefits Of Eating Mushrooms During Monsoon, Mushrooms, Mushroo-TeluguStop.com

అందువల్ల మష్రూమ్స్ ఆరోగ్యపరంగా మనకు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.

Telugu Tips, Latest, Monsoon, Mushrooms-Telugu Health

అలాగే మష్రూమ్స్ తినడం వల్ల అనేక జబ్బులను అడ్డుకోవచ్చు.మష్రూమ్స్ ను తీసుకుంటే ఎముకలు దృఢంగా మారతాయి.వయసు పైబడిన సరే మోకాళ్ళ నొప్పులు ( Knee pain )అన్న మాటే అనరు.

అలాగే బరువు తగ్గాలని భావించే వారికి మష్రూమ్స్ ఒక వరం అని చెప్పుకోవచ్చు.మష్రూమ్స్ లో క్యాలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి.వీటిని తీసుకుంటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.మెటబాలిజం రేటు పెరుగుతుంది.

దీంతో క్యాలరీలు త్వరగా కరిగి బరువు తగ్గుతారు.

Telugu Tips, Latest, Monsoon, Mushrooms-Telugu Health

మష్రూమ్స్ లో ఫైబర్ మెండుగా ఉంటుంది.అందువల్ల వీటిని తీసుకుంటే జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది.మలబద్ధకం ఉంటే దూరం అవుతుంది.

విటమిన్ డి లభించే అతికొద్ది ఆహారాల్లో మష్రూమ్స్ ఒకటి.మష్రూమ్స్ ను డైట్ లో చేర్చుకుంటే విటమిన్ డి కొరత ఏర్పడకుండా ఉంటుంది.

అంతే కాదు మష్రూమ్స్ ను తీసుకోవడం వల్ల ప్రస్తుత ఈ వర్షాకాలంలో వచ్చే అనేక సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.రోగ‌ నిరోధక వ్యవస్థ సూపర్ స్ట్రాంగ్ గా మారుతుంది.

కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.మెదడు మునుపటి కంటే చురుగ్గా పనిచేస్తుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ పుట్టగొడుగుల ద్వారా పొందొచ్చు.మష్రూమ్స్ ను తీసుకుంటే క్యాన్సర్, మధుమేహం( Diabetes ) వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్‌ కూడా తగ్గుతుంది.

కాబట్టి ప్రస్తుత వర్ష కాలంలో విరివిరిగా లభ్యమయ్యే మష్రూమ్స్ ని డైట్ లో చేర్చుకోవడం అస్సలు మిస్ అవ్వకండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube