స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది చుండ్రు సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటారు.చుండ్రు కారణంగా హెయిర్ ఫాల్, డ్రై హెయిర్, మొటిమలు వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
పైగా చుండ్రు వల్ల తలలో పుట్టే దురద మరింత అసౌకర్యాన్ని, చికాకును కలిగిస్తుంది.ఈ క్రమంలోనే చుండ్రును పోగొట్టుకోవడం కోసం ఖరీదైన షాంపూలను కొనుగోలు చేసి వినియోగిస్తుంటారు.
అయితే మార్కెట్‌లో లభ్యమయ్యే షాంపూల వల్ల ప్రయోజనం ఎంత ఉంటుంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే రెండు పదార్థాలు కేవలం ఒక్క రాత్రిలోనే చుండ్రును తరిమి కొడతాయి.
మరి ఇంతకీ ఆ రెండు పదార్థాలు ఏంటి.? వాటిని ఏ విధంగా వినియోగించాలి.? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆవ నూనె వేసుకోవాలి.
ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ లెమన్ జ్యూస్ వేసి స్పూన్ తో కలిసేంత వరకు బాగా మిక్స్ చేయాలి.నైట్ నిద్రించడానికి అర గంట లేదా గంట ముందు ఈ మిశ్రమాన్ని తల మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చని నీటితో శుభ్రంగా హెడ్ బాత్ చేయాలి.ఇలా చేస్తే ఒక్క దెబ్బతో చుండ్రు సమస్య దూరం అవుతుంది.ఆవ నూనె మరియు నిమ్మ రసం లో ఉండే పలు ప్రత్యేక సుగుణాలు చుండ్రును, దాని వల్ల వచ్చే దురదను సులభంగా నివారిస్తాయి.అదే సమయంలో జుట్టు కుదుళ్ళను బలోపేతం చేసి హెయిర్ ఫాల్ సమస్యకు అడ్డు కట్ట వేస్తాయి.
అలాగే ఈ రెమెడీని తరచూ ప్రయత్నిస్తూ ఉంటే చుండ్రు మళ్ళీ మళ్ళీ దరిదాపుల్లోకి రాకుండా సైతం ఉంటుంది.