పీరియడ్స్ సమయంలో కాదు కాని, పీరియడ్స్ మొదలవడానికి ఓ వారం, పది రోజులు లేదా రెండు వారాల ముందు వక్షోజాలు బరువుగా అనిపించడం లేదా బాగా నొప్పిగా అనిపించడం జరుగుతోందా ? ఇది దాదాపుగా అందరు మహిళలకు జరిగేదే.కాని ఓ అనవసరపు భయం ఉంటుంది.
నాకే ఇలా జరుగుతుందేమో, నా శరీరానికే ఎదో జరిగిందేమో అనే భయం.ఆ నొప్పికి కారణం ఏంటో తెలుసుకోవడానికి కూడా మొహమాటపడతారు.అందుకే కారణం ఏమిటో మేము చెబుతున్నాం.ఈ నొప్పి నార్మలా కాదా అనేది తరువాతి విషయం.ముందు ఈ నొప్పి ఎందుకు వస్తుందో చూడండి.
పీరియడ్స్ లో క్రామ్ప్స్ సాధారణ విషయం.
ఆ సమయంలో కడుపులో ఎంత నొప్పిగా అనిపించినా భయపడిపోరు అమ్మాయిలు.ఆ సమయంలో ఈ నొప్పి వస్తుందని తెలుసు కాబట్టి భరిస్తారు.
కాని 28 రోజుల సైకిల్ తీసుకుంటే, దాదాపుగా 21 రోజున అనుకొండి, వక్షోజాలు చాలా బరువుగా అనిపిస్తుంటాయి.సైజు పెరిగినట్టుగా, బరువు పెరిగినట్టుగా ఇబ్బందిపెడతాయి.
ఇది పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పి కాదు కాబట్టి ఆందోళన చెందడం సహజం.
ఇక ఈ నొప్పి ఎందుకు వస్తుంది అంటే ప్రోగ్రెస్టీరోన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవడం వలన.దాంతో వక్షోజాల్లోని డక్ట్స్ సైజ్ పెరిగిపోతాయి.వాటర్ రెంటేన్స్హన్ కూడా జరగటంతో వక్షోజాలు ఉబ్బినట్టుగా అనిపిస్తాయి.
దాంతో నొప్పిగా ఉంటుంది.ఈ నొప్పి ప్రతి ఒక్కరి కేసులో ఒకేలా ఉండకపోవచ్చు.
ఎవరి శరీర తత్వాన్ని బట్టి, హార్మోన్స్ విడుదలని బట్టి ఎక్కువ తక్కువ ఉంటుంది.కొందరికి నొప్పిగా ఉండకపోవచ్చు కూడా.
మరికొందరికి వక్షోజాలతో పాటు నిపుల్స్ కూడా నొప్పివేస్తాయి.అందుకే నొప్పి అందరికి ఇలానే ఉంటుంది అని స్పష్టంగా చెప్పలేం.
మరి ఈ నొప్పి నార్మలా కాదా ? వక్షోజాల సైజు పెరిగినట్టుగా, బరువుగా, ఉబ్బినట్టుగా అనిపించడం సహజమే.ఇదేమి అనారోగ్యం కాదు.కాని రెండు వక్షోజాల్లో నొప్పి ఒకేలా ఉండాలి.రెండు వక్షోజాల బరువు ఒకేలా అనిపించాలి.రెండు వక్షోజాలు ఒక్కే సైజులో ఉబ్బినట్టుగా అనిపించాలి.అలా కాకుండా, ఒకవైపు నొప్పి ఎక్కువ, ఒకవైపు తక్కువగా ఉంటే అది నార్మల్ కండీషన్ కాదు.
డాక్టర్ దగ్గరకి మీరు వెళ్ళాల్సిందే అనే హెచ్చరిక.అలాగే ఈ నొప్పి ఎక్కువ రోజులు ఉంటే కూడా అది అబ్నార్మాల్ కండిషన్.
మరి ఈ నొప్పిని ఎలా అడ్డుకోవాలి ? మంచి బ్రా వాడాలి.ఇబ్బందిపెట్టని బ్రా వాడాలి.
కాఫీ అలవాటు అదుపులో ఉంచుకోవాలి.విటమిన్ ఈ, విటమిన్ బి6 ఉండే ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
లిబు ప్రోఫెన్ .ఇంకొన్ని మందులు కూడా ఉంటాయి కాని ఏం వాడాలనుకున్నా ముందు డాక్టర్ ని సంప్రదించాలి.