Skin Whitening : ఒక్క రాత్రిలో ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చుకోవాలి అనుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!

ఒక్కోసారి ముఖం ఫుల్ గా టాన్( Face Tan ) అయిపోతూ ఉంటుంది.మురికి, మృత కణాలు పేరుకుపోయి చర్మం నల్లగా కాంతిహీనంగా మారుతుంటుంది.

 Try This Home Remedy For White And Glowing Skin Within One Night-TeluguStop.com

అలాంటి సమయంలో ఏదైనా ఫంక్షన్ లేదా పెళ్లి లేదా ఆఫీస్ లో ముఖ్యమైన మీటింగ్ ఉంటే ఇక వారి బాధ వర్ణనాతీతం.ముఖం డార్క్ గా మరియు కాంతి హీనంగా( Dark Look ) కనిపించడం వల్ల కొందరు ఒత్తిడికి లోనవుతుంటారు.

ఇతరులను ఫేస్ చేయలేకపోతుంటారు.అయితే అటువంటి టైమ్ లో ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటించారంటే కేవలం ఒక్క రాత్రిలో ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

Telugu Beautiful Skin, Tips, Face Pack, Skin, Remedy, Skin Care, Skin Care Tips,

ముందుగా ఒక పెద్ద బంగాళదుంప( Potato )ను తీసుకొని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో బంగాళదుంప జ్యూస్ వేసుకోవాలి.

అలాగే ఒక స్పూన్ బియ్యం పిండి( Rice Flooor ) వేసి గరిటెతో బాగా కలుపుతూ ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఉడికించాలి.దాంతో బంగాళదుంప జ్యూస్ స్మూత్ క్రీమ్ లా తయారవుతుంది.

అప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసుకుని తయారు చేసుకున్న మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ), వన్ టేబుల్ స్పూన్ పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు కూడా అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

Telugu Beautiful Skin, Tips, Face Pack, Skin, Remedy, Skin Care, Skin Care Tips,

ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.చివరిగా మంచి మాయిశ్చరైజర్ ను రాసుకోవాలి.ఈ విధంగా చేశారంటే మీ చర్మం నిమిషాల్లో వైట్ అండ్ బ్రైట్ గా( Skin White and Brightening ) మారుతుంది.

టాన్ మొత్తం రిమూవ్ అవుతుంది.చర్మం పై చనిపోయిన కణాలు తొలగిపోతాయి.స్కిన్ లోతుగా శుభ్రం అవుతుంది.మీ ముఖ్యమైన రోజుకు ముందు రోజు ఈ రెమెడీని పాటించారంటే పైసా ఖర్చు లేకుండా చాలా సులభంగా ముఖ చర్మాన్ని తెల్లగా, కాంతివంతంగా మరియు అందంగా మెరిపించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube