పరిశుభ్రత లేని ప్రదేశాల్లో ఎక్కువగా దోమలు ఉంటాయి.దోమల బారి నుండి తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉండడానికి ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ప్రస్తుత కాలంలో విష జ్వరాలు చిన్నా పెద్ద అని తేడా లేకుండా అందరికీ వస్తున్నాయి.చాలా వరకు జ్వరాలు దోమలు కుట్టడం వల్లనే వస్తున్నాయి.
అయితే వాస్తవానికి కొన్ని రకాల వాసనలు దోమలకు అస్సలు పడవు.ఆ వాసన ఉందంటే అక్కడికి దోమలు అసలు వెళ్లవు.
అందువల్ల ఆ వాసన వచ్చే పదార్థాలను మనం ఉపయోగిస్తే దోమలు మన దగ్గరకు రావు.ఇక దోమలకు నచ్చని ఆ పదార్థాలు ఏమిటంటే.
వెల్లుల్లి వాసన దోమలకు పడదు.
వెల్లుల్లిలో ఉండే ఘాటైన వాసన దోమలను తరిమి కొడుతుంది.
వెల్లుల్లి రసం తీసి బాటిల్‌లో నింపి రూంలలో స్ప్రే చేస్తే ఆ వాసనకు దోమలు పరారవుతాయి.అలాగే తులసి ఆకుల వాసన అన్నా దోమలకు పడదు.వాటి నుంచి తీసిన రసాన్ని నీటితో కలిపి స్ప్రే చేస్తే దోమలు రాకుండా ఉంటాయి.పుదీనా రసాన్ని కూడా మనం మస్కిటో రీపెల్లెంట్‌లా ఉపయోగించుకోవచ్చు.
పుదీనా వాసనతో దోమలు మన ఇంటిలోకి ఎప్పటికీ రావు.
లెమన్ గ్రాస్ మొక్క ఆకుల రసం, వేపాకుల రసం కూడా దోమలను తరిమికొట్టేందుకు అద్భుతంగా పనిచేస్తాయి.ఇక సహజ సిద్ధమైన చిట్కాలను పాటించి దోమలను తరిమి కొట్టవచ్చు.అయితే మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ వల్ల కూడా దోమలు వస్తాయి.
మన నుంచి వచ్చే చెమటకు కూడా దోమలు బాగా ఆకర్షితమవుతాయి.కనుక ఈ విషయాలను కూడా దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే దోమలు మనల్ని కుట్టకుండా అప్రమత్తంగా ఉండవచ్చు.
దాంతో విష జ్వరాలు రాకుండా మన ఆరోగ్యాలను కాపాడుకోవచ్చు.