ఒక్కోసారి నీరసం( Boredom ) అనేది విపరీతంగా వేధిస్తుంటుంది.ముఖ్యంగా ప్రస్తుత సమ్మర్ సీజన్ లో అధిక ఎండల కారణంగా ఒంట్లో శక్తి మొత్తం ఆవిరై నీరసం కమ్మేస్తుంటుంది.
దాంతో ఏ పని చేయలేక ఇబ్బంది పడుతుంటారు.అయితే శరీరానికి తక్షణ శక్తి నిచ్చే సూపర్ స్మూతీ ఒకటి ఉంది.
ఈ స్మూతీతో ఎలాంటి నీరసం అయినా పరార్ అవ్వాల్సిందే.మరి లేటెందుకు ఈ స్మూటీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? ఆ స్మూతీ అందించే ఆరోగ్య ప్రయోజనాలేంటి.? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి.

ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఐదారు నైట్ అంతా నానబెట్టి పొట్టు తొలగించిన బాదం గింజలు( Almonds ), ఐదు నానబెట్టుకున్న జీడిపప్పు( cashew nut ), నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు ( Dates )వేసుకోవాలి.వీటితో పాటు అర కప్పు యాపిల్ ముక్కలు( Apple slices ), అర కప్పు పైనాపిల్ ముక్కలు మరియు ఒక గ్లాస్ కొబ్బరి పాలు లేదా కాచి చల్లార్చిన నార్మల్ పాలు వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.దాంతో టేస్టీ అండ్ హెల్తీ యాపిల్ పైనాపిల్ స్మూతీ అనేది రెడీ అవుతుంది.

ఈ స్మూతీని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో కనుక తీసుకుంటే రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండేందుకు అవసరమయ్యే శక్తి లభిస్తుంది.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే ఈ స్మూతీలో ఫైబర్ కంటెంట్ హెవీగా ఉంటుంది.కాబట్టి కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.అతి ఆకలిని తగ్గిస్తుంది.బరువు నిర్వహణలో తోడ్పడుతుంది.
అదే సమయంలో జీర్ణక్రియను చురుగ్గా మార్చి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.అంతేకాదు ఈ ఆపిల్ పైనాపిల్ స్మూతీ చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.
గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా ఈ స్మూతీ సూపర్ గా సహాయపడుతుంది.