ఈ మధ్య కాలంలో చాలా మంది వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ ను డైట్‌లో చేర్చుకుంటున్నారు.వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువగా ఉండే స్టార్చ్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్, గ్లైసీమిక్ ఇండెక్స్ వంటివి తక్కువగా ఉంటాయి.
అందువల్ల, బ్రౌన్ రైస్‌ను డైట్‌లో చేర్చుకుంటే.వెయిట్ లాస్ అవుతారు.
గుండె ఆరోగ్యం ఉంటుంది.మధుమేహం అదుపులో ఉంటుంది.
హై కొలెస్ట్రాల్ తగ్గు ముఖం పడుతుంది.క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు.
అయితే ఆరోగ్యానికే కాదు చర్మానికి అలాగే కేశాలకు కూడా బ్రౌన్ రైస్ ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా హెయిర్ ఫాల్‌ను నివారించడంలో బ్రౌన్ రైస్ అద్భుతంగా సహాయపడుతుంది.మరి కేశాలకు బ్రౌన్ రైస్‌ను ఎలా యూస్ చేయాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా బ్రౌన్ రైస్ తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు స్పూన్ల బ్రౌన్ రైస్ పిండి, ఒక ఎగ్ వైట్ మరియు వాటర్ వేసి జారుగా కలుపుకోవాలి.
ఇప్పుడు తలకు కొబ్బరి నూనెను పెట్టుకునిఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కేశాలకు, కుదళ్లకు బాగా పట్టించాలి.ఇరవై లేదా ముప్పై నిమిషాల అనంతరం కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూతో తల స్నానం చేయాలి.
ఇలా నాలుగు రోజులకు ఒకసారి చేస్తే హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల బ్రౌన్ రైస్ పిండి, ఒక స్పూన్ ఆవ పిండి మరియు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు, కేశాలకు అప్లై చేసి.అర గంట పాటు వదిలేయాలి.
ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో హెడ్ బాత్ చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేసినా జుట్టు రాలడం తగ్గి.
పొడవుగా పెరుగుతుంది.