ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ( Tollywood ) ఖ్యాతిని పెంచుతున్న హీరోలను మనం చూస్తూనే ఉన్నాం.కానీ కొంతమంది కమర్షియల్ సినిమా దర్శకుల వల్ల తెలుగు సినిమా స్థాయి అనేది అంతకంతకు పడిపోయే పరిస్థితికి వస్తుందనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఇక రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డివంగ, నాగ్ అశ్విన్ లాంటి స్టార్ డైరెక్టర్లు పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలను తీస్తూ మంచి విజయాలను అందుకుంటు ముందుకు సాగుతున్న క్రమంలో కొంతమంది కమర్షియల్ డైరెక్టర్లు రొటీన్ సినిమాలను( Routine Movies ) చేస్తున్నారు.
ఇక దీని వల్ల సినిమాలకు చాలావరకు ఇబ్బందులైతే ఎదురయ్యే అవకాశాలైతే ఉంటున్నాయి.ఇక పాన్ ఇండియాలో ముందుకు దూసుకెళ్లాలి అనుకుంటున్న మన వాళ్ళని కమర్షియల్ సినిమాలతో( Commercial Movies ) కొంతమంది డైరెక్టర్లు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు.ఇక దీని వల్ల ప్రస్తుతానికైతే సక్సెస్ లు రావచ్చు.
కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇలాంటి రోటీన్ కథలే వస్తాయి అంటూ మిగతా ఇండస్ట్రీ వాళ్ళు మనవాళ్ళను హేళన చేసే పరిస్థితి వచ్చే అవకాశం అయితే ఉంది.
మరి ఇలాంటి కమర్షియల్ చిత్రాలను ఆపేసి ఎక్స్పరిమెంటల్ సినిమాలను డిఫరెంట్ జానర్ లో తెరకెక్కించే విధంగా దర్శకులు ప్రణాళికలు రూపొందించుకుంటే మంచిది అని ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరోలు ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.కాబట్టి మన హీరోలు దర్శకులు చెప్పినట్టుగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు.ఇక ఇప్పటికైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చే రొటీన్ సినిమాలకు స్వస్తి పలకకపోతే మన సినిమా ఇండస్ట్రీ మరో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది…
.