తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇదిలా ఉంటే సీనియర్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మరి ఏది ఏమైనా కూడా బాలయ్య బాబు లాంటి స్టార్ హీరో సైతం ఇప్పుడు తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ‘డాకు మహారాజ్’ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న బాలయ్య బాబు( Balayya Babu ) తన తదుపరి సినిమాలను కూడా కమర్షియల్ డైరెక్టర్లతోనే చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే బోయపాటి శ్రీను ( Boyapati Srinu )దర్శకత్వంలో ‘అఖండ 2’ సినిమాలో నటిస్తున్న బాలయ్య ఆ తర్వాత గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) తో మరొక సినిమా చేయడానికి కమిట్ అయినట్టుగా తెలుస్తోంది.ఇక దాంతోపాటుగా హరీష్ శంకర్ ( Harish Shankar )డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి ఉత్సాహన్ని చూపిస్తున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇక ఇప్పటి వరకు హరీష్ శంకర్ బాలయ్య బాబు కాంబినేషన్ లో సినిమా అయితే రాలేదు.ఇక వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనే రేంజ్ లో కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక రీసెంట్ గా హరీష్ శంకర్ రవితేజ తో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేసి భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు.మరి ఈయనతో సినిమా చేస్తే బాలయ్య బాబు కి కూడా మరో ప్లాప్ వస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఇక గోపీచంద్ మలినేని లాంటి దర్శకుడితో బాలయ్య ఇప్పటికే వీర సింహారెడ్డి ( Veera Simha Reddy )అనే సినిమా చేశాడు.ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాలయ్య బాబు కు కూడా చాలావరకు మంచి ఇమేజ్ నైతే తీసుకొచ్చి పెట్టిందనే చెప్పాలి.మరి ఇలాంటి సందర్భంలో బాలయ్య మరోసారి గోపీచంద్ మలినేని తో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
.