మృదువైన చేతులు సొంతం కావాలంటే....

సాధారణంగా చాలా మంది ముఖం మీద పెట్టిన శ్రద్ధను చేతుల మీద పెట్టరు.అందువలన చేతులు నల్లగా మరియు ముడుతలతో అసహ్యంగా కనపడుతుంది.

 Easy Ways To Get Soft Hands-TeluguStop.com

ఈ సమస్య నుండి బయట పడటానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.

వారానికి ఒక్కసారైనా చేతులకు కొద్దిగా ఆలివ్ ఆయిల్ ని రాసి మసాజ్ చేయాలి.

ఈ విధంగా చేయుట వలన చేతుల్లో రక్తప్రసరణ బాగా జరిగి చర్మం బిగుతుగా మారుతుంది.

చేతులపై మృత కణాలు పేరుకుంటే ముడతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అందువల్ల పంచదారలో ఆలివ్ నూనె కలిపి చేతులకు రాసుకొని ఆరాక కడిగేయాలి.ఈ విధంగా వారానికి ఒకసారి తప్పనిసరిగా చేయాలి.

చేతులతో పాటు గోళ్ళ మీద కూడా శ్రద్ద పెట్టాలి.గోళ్ళు తాజాగా కనపడాలంటే నిమ్మచెక్కతో గోళ్లను రుద్దాలి.

చేతులపై మచ్చలు ఉంటే కనుక…బంగాళాదుంప స్లైస్ తో రుద్దాలి.బంగాళాదుంపలో ఉన్న బ్లీచింగ్ గుణాలు మచ్చలను తగ్గించటంలో సహాయపడతాయి.

చేతుల వెనక భాగంలో ముడతలు ఉంటే…వారానికి ఒకసారి ఆముదంతో మసాజ్ చేసుకోవాలి.ఇలా కొన్ని వారాల పాటు చేస్తే ముడతలు తగ్గిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube