మన దేశంలో వాస్తు శాస్త్రాన్ని( Vastu Shastra ) చాలా మంది ప్రజలు నమ్ముతారు.వారి ఇంటి నిర్మాణాన్ని కూడా దాదాపు వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.
ప్రజలు వాస్తు ప్రకారం అనుసరిస్తే వారి జీవితంలో ఎలాంటి సమస్యలు రావని నమ్ముతారు.చాలా మంది ఈ రోజుల్లో తమ ఇంటి లో ఏమైనా సమస్యలు వస్తే వాస్తును అనుసరించడం వలన ఆ సమస్యలను దూరం చేసుకుంటూ ఉన్నారు.
మీ ఇంట్లో కూడా తరచూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుందా, అయితే కచ్చితంగా మీరు కూడా వాస్తు చిట్కాలను పాటించాల్సిందే.ఈ మార్పులను కనుక మీ ఇంట్లో చేశారంటే సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.
అలాగే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ( Negative energy ) దూరంగా వెళ్ళిపోతుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఇంటికి రంగులు వేయించేటప్పుడు అన్ని గదులకి ఒకే రంగు అస్సలు వేయకూడదు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి వేరువేరుగా రంగులు వేయడం మంచిది.అలాగే ప్రకృతికి సంబంధించి ఫోటోలని ఇంట్లో ఉంచుకోవడం వలన గదుల్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.ఇంకా చెప్పాలంటే వ్యాపారంలో, చదువులో మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.డబ్బుని కూడా మీరు బాగా సంపాదించవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే బెడ్ రూమ్ లో ఎరుపు రంగు కానీ, గులాబీ రంగు కానీ ఉంటే ప్రేమా, నమ్మకం బాగా పెరుగుతాయి.ఇంకా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి.
అంతే కాకుండా నీలం రంగు( blue color ) కానీ లైట్ గ్రే కలర్ కానీ ఉంచితే పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది.పిల్లలు చదువుకునే గదిలో ఈ రంగులను వేయడం ఎంతో మంచిది.
అలాగే ఆరెంజ్ కలర్ కూడా పిల్లలు ఉండే గదిలో వేస్తే వారికి ఎంతో మంచిది.ఇలాగే జాగ్రత్తలు తీసుకుంటూ వాస్తు ప్రకారం చేస్తే ఇలాంటి సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు.