ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.57
సూర్యాస్తమయం: సాయంత్రం.6.34
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.
దుర్ముహూర్తం: మ.12.24 ల1.12
ల2.46 ల3.34
మేషం:

ఈరోజు భాగస్వామ్య వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి.సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది.ఆదాయ మార్గాలు పెరుగుతాయి.ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిదికాదు.
వృషభం:

ఈరోజు జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది.వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు.నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు.ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.
మిథునం:

ఈరోజు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు.దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు.ఇంటాబయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు.
పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు.నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
కర్కాటకం:

ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.
బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి.
సింహం:

ఈరోజు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది.మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు.భూ సంబంధిత క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు.
కన్య:

స్ధిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి.ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి.గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.
ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి.వాహన యోగం ఉన్నది.వృత్తి ఉద్యోగాలలో సమయపాలనతో పనులు పూర్తి చేస్తారు.
తుల:

ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది.ఇంటాబయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు.
గృహమున ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.వృత్తి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు.
వృశ్చికం:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది.కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి.దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
ధనుస్సు:

ఈరోజు వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.సోదరులతో శుభకార్యాలు గూర్చి చర్చిస్తారు.ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి.దూరప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది.
మకరం:

ఈరోజు అనారోగ్య సమస్యల నుండి బయట పడతారు.జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి.చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి.చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.
కుంభం:

ఈరోజు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.రుణాలు కొంత వరకు తొలగుతాయి.కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.నూతన వస్త్ర వస్తు లాభాలు పొందుతారు.కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు.
మీనం:

ఈరోజు నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు ఫలిస్తాయి.కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది.చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.వ్యాపారాలు లభిస్తాయి.