పాదాల పగుళ్లతో నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందా.. ఇలా చేస్తే రెండు రోజుల్లో విముక్తి పొందవచ్చు!

పాదాల పగుళ్లు.చాలా మందిని కలవరపెట్టే కామన్ సమస్య ఇది.ఊబకాయం, పాదాల సంరక్షణ లేకపోవడం, శరీరంలో వేడి ఎక్కువ అవ్వడం, వాతావరణంలో వచ్చే మార్పులు, పొడి చ‌ర్మం తదితర కారణాల వల్ల పాదాల పగుళ్లు ఏర్పడుతుంటాయి.వీటి కారణంగా కొందరికి నడవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది.

 Homemade Cream, Cracked Feet, Foot Care, Cracked Heels, Latest News, Health, Hea-TeluguStop.com

పాదాల పగుళ్లు తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.అందుకే వీటిని వదిలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే క్రీమ్ ను వాడాల్సిందే.

ఈ న్యాచురల్ క్రీమ్ ను వాడితే కనుక రెండు రోజుల్లోనే పాదాల పగుళ్ల నుంచి విముక్తి పొందుతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక క్యాండిల్ ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు ఆవ నూనె వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ క్యాండిల్ ముక్కలు వేసి మెల్ట్ అయ్యేంతవరకు హీట్ చేయాలి.

Telugu Cracked Feet, Cracked Heels, Care, Tips, Homemade Cream, Latest-Telugu He

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో వన్ టేబుల్ స్పూన్ వాసెలిన్, వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేసి ఒక బాక్స్ లోకి టర్న్ చేసుకోవాలి.గంట పాటు వదిలేస్తే మన క్రీమ్ సిద్ధం అవుతుంది.నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను పాదాలకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

ఆపై సాక్స్‌ ధరించి పడుకోవాలి.ప్రతిరోజు ఈ క్రీమ్ ను వాడితే పగుళ్లు దెబ్బకు పరార్ అవుతాయి. మీ పాదాలు సున్నితంగా మృదువుగా మారుతాయి.నిత్యం ఈ క్రీమ్ ను వాడితే పాదాల పగుళ్లు తగ్గడమే కాదు.మళ్ళీ మళ్ళీ మీ దరిదాపుల్లోకి రాకుండా సైతం ఉంటాయి.కాబట్టి పాదాల పగుళ్ళతో ఇబ్బంది పడుతున్న వారు తప్పకుండా ఈ క్రీమ్ ను ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube