సోషల్ మీడియాలో ఏ చిన్న సంఘటన జరిగినా, అది క్షణాల్లో వైరల్ అవుతోంది.ముఖ్యంగా వినోదాత్మక వీడియోలు, సోషల్ అవేర్‌నెస్ కంటెంట్, విచిత్రమైన సంఘటనలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో, సైబర్ నేరాలపై( Cyber Crimes ) అవగాహన కల్పించే ఒక వాయిస్ మెసేజ్ వైరల్‌గా మారింది.నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
లక్కీ డ్రా గెలిచారని, తక్కువ వడ్డీకి లోన్ ఇస్తామంటూ మోసపూరిత కాల్స్ చేసి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.ఈ మోసాల నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో, ప్రభుత్వం ఫోన్ కాల్ చేసినప్పుడు ఓ వాయిస్ మెసేజ్‌ను( Voice Message ) వినిపించేలాగా ఏర్పాటు చేసింది.“జాగ్రత్త! లాటరీ గెలిచారు, ఇన్‌స్టంట్ లోన్స్ ఇస్తాము, ఇంట్లోనే కూర్చొని డబ్బులు సంపాదించండి” వంటి సందేశాలు మోసం చేయడానికి ఉద్దేశించినవని ప్రజలకు హెచ్చరికగా ఈ వాయిస్ మెసేజ్ ఇవ్వబడింది.అయితే, ప్రతిసారి ఫోన్ కాల్ చేసినప్పుడు ఇదే వాయిస్ వినిపించడంతో కొంతమంది దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదే విషయంపై తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
ఈ వాయిస్ మెసేజ్‌కు భిన్నమైన రియాక్షన్లు వస్తున్నాయి.కొందరు దీన్ని ఉపయోగకరంగా భావిస్తే, మరికొందరు దీనిపై సరదాగా ట్రోల్స్ చేస్తున్నారు.నువ్వు చెప్పేది మంచి విషయమే అయినా పదేపదే చెబుతున్నందుకు చిరాకు వస్తోందనీ కొందరు కామెంట్ చేస్తుండగా.మరి కొందరేమో ఫన్నీగా నువ్వు కనపడితే కచ్చితంగా కొడదాం అనుకుంటున్నా బ్రో అంటూ కామెంట్ చేస్తున్నారు.