చాలా మంది మహిళలు ఫేషియల్ హెయిర్ తో తీవ్రంగా సతమతం అవుతుంటారు.ఫేషియల్ హెయిర్ ఉండటం వల్ల చర్మం డార్క్ గా కనిపిస్తుంది.
అలాగే ముఖంలో కాంతి సైతం తగ్గుతుంది.ఈ క్రమంలోనే ఫేషియల్ హెయిర్ ను తొలగించుకోవడం కోసం రకరకాల టూల్స్ ను వాడుతుంటారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే న్యాచురల్ గానే ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవుతుంది.అలాగే ఈ మ్యాజికల్ రెమెడీని పాటించడం వల్ల ముఖ చర్మం వైట్ గా మరియు బ్రైట్ గా సైతం మారుతుంది.
మరి ఇంతకీ ఆ మ్యాజికల్ రెమెడీ ఏంటి అనేది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు పాలు వేసుకోవాలి.
అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, రెండు టేబుల్ స్పూన్లు షుగర్ వేసి పాలు సగం అయ్యేంత వరకు మరిగించాలి.ఇలా మరించిన పాలు చల్లారబెట్టుకోవాలి.
పాలు పూర్తిగా కూల్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని కనీసం ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వేళ్ళతో చర్మాన్ని రబ్ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ మ్యాజికల్ హోమ్ రెమెడీని పాటించడం వల్ల ఫేషియల్ హెయిర్ రిమూవ్ అవుతుంది.
అలాగే చర్మం పై పేరుకుపోయిన మురికి మృతకణాలు తొలగిపోతాయి.

చర్మం బ్రైట్ గా మారుతుంది.అలాగే స్కిన్ వైట్నింగ్ కి కూడా ఈ రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలని భావించేవారు మార్కెట్లో లభ్యం అయ్యే స్కిన్ వైట్నింగ్ క్రీములపై ఆధారపడకుండా ఇంట్లోనే ఈ మ్యాజికల్ రెమెడీని పాటించండి.
మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.







