తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ దివంగత కమెడియన్ వేణుమాధవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నితిన్ హీరోగా నటించిన సై సినిమాలో నల్లబాలు నల్ల తాచు కింద లెక్క అన్న ఒక్క డైలాగ్ తో భారీగా పాపులారిటీని సంపాదించుకున్నాడు వేణుమాధవ్.
ఒకప్పుడు తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని కమెడియన్లలో వేణుమాధవ్ కూడా ఒకరు అని చెప్పవచ్చు.
అయితే ఎంతో జీవితం ఉన్న వేణుమాధవ్ పలు రకాల అనారోగ్య సమస్యల వల్ల అతి చిన్న వయసులోనే మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా వేణుమాధవ్ మరణానికి సంబంధించి అతని తల్లి సావిత్రమ్మ షాకింగ్ విషయాలను వెల్లడించింది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సావిత్రమ్మ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ వేణుమాధవ్ గురించి తెలిపింది.నా కొడుకు వేణుమాధవ్ చనిపోయేటప్పటికి రూ.20 కోట్ల ఆస్తులు ఉన్నాయి.

అయినప్పటికీ నేను నా మూడో కొడుకుతోనే అద్దె ఇంట్లో ఉన్నాను.వేణు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల నా ఇద్దరు కొడుకులను వేణుకు అసిస్టెంట్లుగా పెట్టాను.కానీ వేణు చనిపోవడంతో వారు ఎటువంటి అండ లేకుండా ఉండిపోయారు.
వేణుమాధవ్ తన ఆరోగ్యాన్ని తానే పాడు చేసుకున్నాడు.తనకు ఒక చెడు అలవాటు ఉంది.
ఆ అలవాటే వేణు ప్రాణం తీసింది అంటూ ఎమోషనల్ అయింది సావిత్రమ్మ.

వేణుమాధవ్ కి చిన్నప్పటి నుంచి ఎటువంటి జబ్బులు వచ్చినా మందులు వేసుకునే అలవాటు లేదని ఆ అలవాటు కారణంగా వేణుమాధవ్ మరణించాడు అని చెబుతూ ఎమోషనల్ అయింది. జాండీస్ డెంగ్యూ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తే అవి నిర్లక్ష్యం చేయడంతో పరిస్థితి చేయి దాటిపోయి వేణుమాధవ్ చనిపోయాడు అని కన్నీరు పెట్టుకుని సావిత్రమ్మ.నా పెద్ద కొడుకు చనిపోయిన 45 రోజులకే వేణుమాధవ్ కూడా చనిపోయాడు అంటూ కన్నీటి పర్యంతం అయింది.
అయితే వేణుమాధవ్ కి ఇద్దరు కొడుకులు ఉన్నారని వాళ్లు సొంత ఇంట్లోనే ఉన్నారని, కానీ తాను మాత్రం మూడవ కొడుకుని చూసుకుంటూ అద్దె ఇంట్లో ఉన్నట్టు చెప్పుకొచ్చింది సావిత్రమ్మ.







