వాణి జయరాం( Vani Jayaram ) .సంగీత సరస్వతి.
అపార మేధావి.గాత్రం తో ఎలాంటి అద్భుతం అయినా సృష్టించగలదు.
కె విశ్వనాధ్ ఏ సినిమా తీసిన అందులో ఒక్క పాట అయినా వాణి జయరాం తో పాడించేవారు.అలాంటి ఒక మహా గాయని పై ఒక చెత్త వార్త తమిళ మీడియా లో వచ్చింది.
అంతే సంగీత ప్రపంచం ఏకమై పోయింది.అప్పటి వరకు సంగీత విద్వాంసులు, సంగీత కళాకారులూ మీడియా సమావేశాల్లో పాల్గొనే వారు.
కానీ వాణి జయరాం కి వచ్చిన పరిస్థితి వల్ల అప్పటి నుంచి సంగీతం కి సంబంధించి ఎవరు కూడా మీడియా సమావేశాల్లో పాల్గొనకూడదని ఆర్డర్ వేశారు.చిత్రంగా ఇప్పటికి కూడా అదే ఆర్డర్ ని అందరు ఫాలో అవుతున్నారు.
ఇక అసలు విషయం ఏమిటి అంటే అప్పట్లో వాణి జయరాం ఎక్కువగా కొత్త పాత అనే తేడా లేకుండా అందరితో చనువుగా ఉండేవారు.ఆమెది ఎంతో స్వచ్ఛమైన మనసు కానీ మీడియా కు నిజం తో పని లేదు.మహా అందగతే కూడా.అప్పట్లో మ్యూజిక్ డైరెక్టర్స్( Music Directors ) ఎలా ఉండేవారంటే ఎలాంటి సమయం అయినా సరే స్టూడియో లలో ఎక్కువగా టైం గడిపే వారు.
పాటల కూర్పు పై ఉన్న ద్యాస మిగతా విషయాల పై ఉండేది కాదు.ఏం ఎస్ విశ్వనాథన్ ( ANS Viswanathan )నుంచి కె వి మహదేవన్( KV Mahadevan ) వరకు అందరు అలాగే ఉండేవారు.
భోజనం దగ్గర నుంచి అన్ని పనులు ఎక్కువగా స్టూడియోస్ లోనే చేసేవారు.ఆలా వేళా పాలా లేకుండా రికార్డింగ్స్ కూడా జరిగేవి.
దాంతో ఆమెపై కొని చెత్త వ్యాఖ్యానాలు వచ్చాయి అందరు కలిసి ఈ విషయం పై సీరియస్ అయ్యారు.తద్వారా ఆమెకు కొన్ని సినిమా అవకాశాలు కూడా పోయాయి.ఒక గాయని పై హీరోయిన్ కన్నా ఎక్కువగా ఇలా వార్తలు రావడం తట్టుకోలేక పోయారు.దాంతో అందరు ఒక రోజు ఒక సమావేశం ఏర్పరుచుకొని ఇక పై ఎలాంటి విషయాల్లోను మీడియా తో ఎవరు మాట్లాడకూడదని, సమావేశాలకు హాజరు కాకుడని నిర్ణయించుకున్నారు.
ఆలా అపర సంగీత సరస్వతి అయినా వాణి జయరాం 19 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడి పద్మభూషణ్ అవార్డు అందుకుని ఈ ఏడాది ఫిబ్రవరి లో కన్ను మూసారు.