ఎర్ర ఉల్లిగడ్డ తింటే ఆ జబ్బు రానే రాదట

ఉల్లిగడ్డ ఎన్ని మినరల్స్ కలిగినదో మనం ఇప్పటికే చదువుకున్నాం.మార్కెట్లో రెండురకాల ఉల్లిగడ్డలు దొరుకుతాయి.

ఒకటి తెల్ల రంగులో ఉంటే, మరో కొంచెం మేరున్ లాగా ఎరుపు రంగులో ఉంటుంది.రెండు మంచివే, రెండు మినరల్స్ కలిగినవే.

 Eating Red Onions Can Avoid And Cure Cancer – Study-Eating Red Onions Can Avoid And Cure Cancer – Study-Telugu Health-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రెండిటి మధ్య తేడా ఏంటో మనం తరువాత తెలుసుకుందాం కాని, ఎర్ర ఉల్లిగడ్డ వలన ఒక అద్భుతమైన లాభం ఉందని కనుగొన్నారు కెనడాకి చెందిన గుల్ఫ్ యూనివర్సిటీ వారు.ఆ పరిశోధకుల బృందంలో ఒక భారతీయుడు కూడా ఉండటం విశేషం.

ఇక ఎర్ర ఉల్లిగడ్డ వలన దొరికే ఆ అధ్బుతమైన లాభం ఏమిటంటే … ఇది క్యాన్సర్ ని ట్రీట్ చేస్తుందట.మొదటిదశలోనే, క్యాన్సర్ చాలా చిన్నగా ఉన్నప్పుడే గుర్తించి ఎర్ర ఉల్లిగడ్డ తీసుకుంటే అది పెరగకుండా అడ్డుకోవచ్చు అంట.మొదటినుంచి తినే అలవాటు ఉంటే క్యాన్సర్ రాకుండా అడ్డుకోవచ్చు కూడా.రొమ్ము క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్ పై ఎర్ర ఉల్లిగడ్డ బ్రహ్మాండంగా పనిచేస్తుంది.

ఎర్ర ఉల్లిగడ్డలో క్వెర్సెటిన్ చాలా ఎక్కువగా ఉంటుంది.ఇదోరకం ఫ్లవోనాయిడ్.

దీంతో పాటు ఆన్తోక్యానిన్ కూడా ఎక్కువ ఉంటుంది.వీటిని క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం ఉపయోగిస్తారు.

ఈ రెండు ఎలిమెంట్స్ క్యాన్సర్ సెల్స్ ని చంపుతాయి.ఇంకో మాటలో చెప్పాలంటే, క్యాన్సర్ సెల్స్ ఇవి శరీరంలో ఉండగా సునాయాసంగా పెరగలేవు.

క్యాన్సర్ సెల్స్ జీవనాన్ని కష్టతరం చేస్తాయి ఈ ఫ్లోవోనాయిడ్స్.

పరిశోధకులు ఈ రిసెర్చి కోసం అయిదు రకాల ఉల్లిగడ్డలను నేచురల్ కండిషన్స్ లో పెంచారు.

క్యాన్సర్ సెల్స్ మీద వాటి ప్రభావాన్ని పరీక్షించారు.అందులో ఎర్రఉల్లిగడ్డల ప్రభావం వారికి ఆశ్చర్యకరంగా అనిపించింది.

ఎర్ర ఉల్లిగడ్డలో ఉండే క్వేర్సేటిన్ క్యాన్సర్ సెల్స్ ని సునాయాసంగా చంపుతోంది.అందుకే వారు ఓ ప్లాన్ వేసారు.

ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఎర్ర ఉల్లిగడ్డలోంచి క్వేర్సిటిన్ ని బయటకు తీసి, వాటిని ఇంజేక్షన్స్ రూపంలో క్యాన్సర్ పేషెంట్స్ కి ఇవ్వాలని భావిస్తున్నారు పరిశోధకులు.ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఆ మందులో వచ్చేలోపు సలాడ్స్ రూపంలో పచ్చిగా ఎర్ర ఉల్లిగడ్డలను తినమంటున్నారు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు