ఎండాకాలంలో తాటి ముంజలకు ఎంతో డిమాండ్ ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
ఇది రుచికరమైన పండు మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది.తాటి ముంజలలో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.
ముఖ్యంగా విటమిన్ సి, ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం( Potassium, Calcium ) లాంటివి ఎక్కువగా ఉంటాయి.తాటి ముంజలలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

అలాగే మలబద్దకాన్ని నివారించి జీర్ణ సమస్యలను( Digestive problems ) దూరం చేస్తుంది.ఇందులోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే జలుబు, దగ్గు వంటి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడానికి, ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో ఉండే పొటాషియం రక్తపోటు ను నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.అలాగే మూత్రం విసర్జక లక్షణాలు,మూత్ర పిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

మూత్రపిండాలలో రాళ్లు( Kidney Stones ) ఏర్పడకుండా నిరోధిస్తుంది.తాటి ముంజలలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.ముడతలు, మచ్చలను నివారించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.తాటి ముంజలలో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.తాటి ముంజలలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఎంతో మంచిది.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది.
ఇందులో ఎక్కువ నీరు ఉండడం కారణంగా వేసవికాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.వేసవికాలంలో వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.