సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లు పాత్ర డిమాండ్ చేస్తే ఏ క్యారెక్టర్ లో నటించడానికి అయిన సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి ఎంత మాత్రం ఆలోచించాల్సిన పనిలేదు.ఎందుకంటే ఇప్పుడున్న హీరోలని చూస్తే మనకు అర్థమవుతుంది ఏ పాత్ర చేయడానికైనా సిద్ధం గా ఉంటూ వాళ్లని వాళ్లు మౌల్డ్ చేసుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోలుగా తీర్చిదిద్దుకోవాలని ఉద్దేశంతో ముందుకు దూసుకెళ్తున్నారు.
అందులో భాగంగానే ఇండస్ట్రీలో కొత్తకొత్త స్టోరీలు చేస్తూ మంచి విజయాల్ని అందుకుంటున్నారు.అయితే ఒకప్పుడు కె.
విశ్వనాధ్ దర్శకుడిగా చాలా సినిమాలని తెరకెక్కించారు ఆయన దర్శకుడిగా శంకరాభరణం లాంటి ఒక క్లాసికల్ సినిమాని తెలుగు ఇండస్ట్రీలో తీసి ఇండియా వైస్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.అలాంటి విశ్వనాథ్ గారి దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా చాలా సినిమాలు వచ్చాయి.
వీళ్ళిద్దరి కాంబినేషన్ కి తెలుగులో మంచి గుర్తింపు ఉంది అయితే కమల్ హాసన్ ని తెలుగులో స్టార్ హీరోని చేసింది కూడా విశ్వనాధ్ అనే చెప్పాలి.ఆయన సినిమాల్లో సంగీతానికి నాట్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో కమల్ హాసన్ అయితే తన క్యారెక్టర్ కి ప్రాణం పోస్తాడు అనే ఉద్దేశంతో కమల్ హాసన్ తో చాలా సినిమాలు తీశాడు.
సాగరసంగమం, శుభసంకల్పం, స్వాతిముత్యం లాంటి క్లాసికల్ హిట్స్ వీళ్ళ కాంబినేషన్ లో ఉన్నాయి.అయితే మొదటగా కె.విశ్వనాథ్ సుధాకర్ ని హీరోగా పెట్టి శుభలేఖ అనే సినిమాని తెరకెక్కించాడు ఆ సినిమాలో హీరోగా నటించిన సుధాకర్ పేరు శుభలేఖ సుధాకర్ గా మారిపోయింది.
ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోగా నటించాడు అలాగే శివ లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ప్రస్తుతం ఇప్పటికి కూడా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు పొందుతున్నాడు ముఖ్యంగా అరవింద సమేత సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ చేసి తనకు తానే సాటి అని నిరూపించుకుంటూ జనాల అందరినీ మెప్పించారు.అయితే శుభలేఖ సుధాకర్ ఒక ఇంటర్వ్యూలో సాగర సంగమం సినిమా గురించి మాట్లాడుతూ విశ్వనాధ్ గారు ఆయన సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ ఎలా మాట్లాడాలి ఎలా డైలాగ్స్ చెప్పాలి అనేది ఆయన దగ్గరుండి చేసి చూపిస్తాడు.
సాగరసంగమం సినిమాలో ఒక సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాడు.అదేంటంటే జయప్రద కమల్ హాసన్ దగ్గరకు వచ్చి ఒక కార్డు ఇచ్చి అందులో ఉన్న అందరూ గొప్ప వాళ్ళు అని చెప్పడంతో కమల్ హాసన్ ని చూస్తూ ఉంటాడు.అందులో తన ఫోటో ఉంటుంది తనని కూడా గొప్పవారిగా గుర్తించినందుకు కమల్ హాసన్ బాగా ఎమోషనల్ అవుతూ ముద్దు పెట్టుకునే సీన్ ఉంది.
అయితే ఆ సీన్ లో కమల్ హాసన్ మొదట నేను ముద్దు పెట్టలేను అని డైరెక్టర్ కి చెప్పాడు కానీ డైరెక్టర్ అయిన విశ్వనాథ్ ఆ సీన్ పండాలి అంటే తప్పకుండా నువ్వు ముద్దు పెట్టుకోవాలి అని చెప్పడంతో కమల్ హాసన్ చివరికి ఒప్పుకొని అలా చేశారు.
ఆ సీన్ స్క్రీన్ పై బాగా పండిందని చెప్పారు.ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది.అయితే అప్పుడు ఆ సినిమాలో ముద్దు పెట్టుకోవడానికి చాలా ఆలోచించాడు కమలహాసన్ అప్పుడు ముద్దు పెట్టుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉండేవారు కానీ ఇప్పుడు ఎవరు ఏ మాత్రం ఆలోచించకుండా సీన్ డిమాండ్ చేస్తే ముద్దు అనే కాదు ఏది చేయడానికైనా ఆర్టిస్ట్ లు ఓకే అనేస్తున్నారు.
ఎంతైనా అప్పుడున్న సినిమా కల్చర్ కి ఇప్పుడున్న సినిమా కల్చర్ కి చాలా తేడా ఉంది అని అవకాశం వచ్చిన ప్రతిసారి ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది పెద్దలు చెబుతూనే ఉంటున్నారు…
.