గొంతు నొప్పిని తరిమికొట్టే మోస్ట్ ఎఫెక్టివ్ డ్రింక్ మీకోసం..?

ప్రస్తుత వర్షాకాలంలో చాలా మంది ఫేస్ చేసి కామన్ సమస్యలో గొంతు నొప్పి ఒకటి.వాతావరణంలో వచ్చే మార్పులు, వాటర్ సరిగ్గా తాగకపోవడం, అతిగా శీతల పానీయాలు తీసుకోవడం తదితర అంశాలు గొంతు నొప్పికి( throat pain ) కారణం అవుతుంటాయి.

 The Most Effective Drink To Get Rid Of Sore Throat Is For You! Sore Throat, Thro-TeluguStop.com

ఏదైనా గొంతు నొప్పి వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది.ఏ పని చేయలేకపోతుంటారు.

తీవ్రమైన బాధకు గురవుతుంటారు.ఈ క్రమంలోనే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటారు.

కానీ పెయిన్ కిల్లర్స్ తో పని లేకుండా సహజంగా కూడా గొంతు నొప్పిని తరిమికొట్టొచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే మోస్ట్ ఎఫెక్టివ్ డ్రింక్ ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.

రోజుకి ఒక్కసారి ఈ డ్రింక్ ను తీసుకుంటే రెండు రోజుల్లోనే గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.అందుకోసం ముందుగా నాలుగు మిరియాలు( Pepper ) తీసుకుని మెత్తగా దంచి పెట్టుకోవాలి.

Telugu Tips, Latest, Sore Throat, Effectiverid, Throat Pain-Telugu Health

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక దంచి పెట్టుకున్న మిరియాలు మరియు ఐదు ఫ్రెష్ తులసి ఆకులు( Basil leaves ) వేసుకొని 12 నుంచి 15 నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైనర్ సహాయంతో వాటర్ ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన తేనె( honey ) కలిపితే మన డ్రింక్ రెడీ అవుతుంది.

Telugu Tips, Latest, Sore Throat, Effectiverid, Throat Pain-Telugu Health

రోజు ఉదయం లేదా సాయంత్రం వేళ ఈ డ్రింక్ ను గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోవాలి.మిరియాలు, తులసి మరియు తేనె లో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ( Anti-viral, anti-bacterial )మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ గొంతు నొప్పిని చాలా వేగంగా తరిమి కొడతాయి.గొంతులో పేరుకుపోయిన బ్యాక్టీరియా మరియు ఇన్ఫెక్షన్ ను నాశనం చేస్తాయి.గొంతు నొప్పితో బాధపడుతున్న వారికి ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది.అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉంటే త‌గ్గు ముఖం పడతాయి.ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు సైతం బయటకు తొలగిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube