టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కేవలం సినిమాలతో పాటు వ్యాపారాలు కేసుల చక్కగా చేస్తూ భార్య సహాయసహకారాలతో సక్సెస్ ఫుల్ గా ముందుకు దూసుకుపోతున్నాడు.గతంలో ఆసియన్ సంస్థ తో కలిసి AMB సినిమాస్ పేరు తో కలిపి గచ్సిబౌలి లో ఒక మాల్ నిర్మించాడు.
ఈ థియేటర్ లో ఎన్నో అత్యాధునిక సౌకర్యాలు కలిగి ఉంది ఎంతో రిచ్ గా ఉంటుంది.మహేష్ బాబు అంటే ఆ మాత్రం బ్రాండ్ ఉండటం పెద్ద విషయం ఏమి కాదు.
ఎలాంటి సినిమా అయినా సరే హిట్ అండ్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఈ థియేటర్ ఫుల్ అవుతూ మహేష్ బాబు తో ఆసియన్ వారికి లాభాల పంట పండిస్తోంది.ఇక ఇప్పుడు మహేష్ బాబు తమ పాత మిత్రుడైన ఆసియన్ సంస్థ తో కలిసి ఆసియన్ నమృత రెస్టారెంట్ ని కొత్తగా ప్రారంభించాడు.
ఈ రెస్టారెంట్ లో అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంటూ అన్ని దేశాల రుచులను కూడా పరిచయం చేస్తున్నారు.లోకల్ టూ నాన్ లోకల్, ఇండియన్ టూ కాంటినెంట్ వరకు అన్ని ఇక్కడ లభ్యం అవుతున్నాయట.
ఇన్ని అందుబాటులో పెట్టినప్పటికి ఈ రెస్టారెంట్ మాత్రం సామాన్యులకు అందుబాటులో లేదని తెలుస్తుంది.ఎందుకంటే ఇక్కడ ఐటమ్స్ రేట్లు చూసి మాములు వాళ్ళు ఇక్కడ అడుగు కూడా పెట్టలేరు అని అనుకుంటున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే పది రూపాయలకు లభ్యం అయ్యే ఒక్క ప్లేట్ పునుగులు ధర మన మహేష్ బాబు రెస్టారెంట్ లో కేవలం 125 రూపాయలకే దొరుకుతున్నాయట.ఇక దోస మినిమమ్ 200 రూపీస్ నుంచి మొదలు ఇడ్లి ధర వంద రూపాయలు ఉందట.
బయట ఎక్కడ దొరకని ఐటమ్స్ కి ఇలా వందల్లో రేటు పెడితే బావురుమంటూ తింటారేమో కానీ అందరిని అందుబాటులో ఉండే ఇలాంటి ఇడ్లి, దోసలకు ఇంత రేటు ఏంటి అని అందరు నోరెళ్లబెడుతున్నారు.ఇక ఫ్యామిలీ తో కలిసి మహేష్ నమ్రత రెస్టారెంట్ కి వెళ్తే దాదాపు 1000 కి బిల్లు కట్టకుండా బయటకు రాలేరు.దయచేసి హార్ట్ పేషేంట్స్ ఎవరు సదరు హోటల్లో లో అడుగు పెట్టకండి ఎందుకంటే ఆ బిల్లు కడితే మీకు మరోమారు హార్ట్ అటాక్ రావడం ఖాయం.