బేబీ షామిలి.ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
చైల్డ్ ఆర్టిస్టుగా అదరగొట్టింది.చిన్నప్పుడే జనాల మదిలో నిలిచిపోయింది.
ఆ తర్వాత ఓయ్ సినిమాతో హీరోయిన్ గా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.అయితే తొలి సినిమా ఈ అమ్మడుకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు.
పైగా నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కు గురైంది.లావుగా ఉంది.
ముఖంలో కళ లేదు.అంటూ ఎవరికి తోచిన రీతిలో వారు కామెంట్స్ చేశారు.
ఈ విమర్శలు తనకు తీవ్ర ఆవేదనను కలిగించాయని అప్పట్లో చెప్పింది షామిలి.వెంటనే తన బరువును భారీగా తగ్గించుకుంది.చక్కటి రూపాన్ని పొందింది.ఆ తర్వాత నాగ శౌర్యతో కలిసి అమ్మమ్మ గారి ఇల్లు సినిమా చేసింది.ఈ సినిమా కూడా అంతగా ఆడలేదు.హీరోయిన్ గా ఈమెకు పెద్ద పేరు తీసుకురాలేదు.
మొత్తంగా ఈ రెండు సినిమాలు తన కెరీర్ కు అంతగా ఉపయోగపడలేదు.దీంతో తను సినిమాలకు బ్రేక్ చెప్పి.
చదువు మీద ఫోకస్ పెట్టింది.తాజాగా షామిలీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
ఈ ఫోటోల్లో తనను చూసి అందరూ వారెవ్వా అంటున్నారు.
షామిలి అక్క షాలిని.
కోలీవుడ్ స్టార్ హీరో.అజిత్ భార్య.
తాజాగా వీరింట్లో ఓ వేడుక జరిగింది.అందులో వీరంతా కలిసి కనువిందు చేశారు.
తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలోకి ఎక్కాయి.ఈ ఫోటోలో షామిలి మెరిసిపోతుంది.
ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం ముద్దుగా మారింది.పట్టు చీరలో మరింత అందాన్ని అద్దుకున్నట్లు కనిపించింది.
స్లీవ్ లెస్ బ్లౌస్.దానికి తగినట్లుగా ముడి వేసిన జుట్టుతో షామిలీ అదరగొట్టింది.
అక్క షాలిని, ఆమె కూతురు అనోష్క అజిత్, అజిత్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది.
మరో వైపు ఈ ఫోటోలనూ ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.మునుపటి మాదిరిగా అందంగా కనిపించడం లేదంటున్నారు.ఇంతకీ ఈమె షామిలీయేనా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ప్రస్తుతం తను సినిమాల్లోకి వచ్చే విషయం గురించి ఏ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.