ఎండాకాలం( summer season ) రానే వచ్చింది.ఉష్ణోగ్రతలు మెల్లమెల్లగా పెరగడం స్టార్ట్ అవుతుంది.
ఎండలు జనాలను అల్లాడిస్తున్నాయి.అయితే ఈ సీజన్ లో ప్రధానంగా ఎదురయ్యే సమస్యల్లో స్కిన్ టాన్ ఒకటి.
ఎండల్లో కొంచెం సేపు తిరిగినా కూడా స్కిన్ అనేది నల్లబడడం ఎర్రగా కందిపోవడం జరుగుతుంటుంది.టాన్ అయిన చర్మాన్ని రిపేర్ చేసుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.
అయితే ఇంట్లో మిగిలిపోయిన రైస్ తో బెస్ట్ డీ-టాన్ రెమెడీ ఒకటి ఉంది.ఈ రెమెడీని పాటిస్తే రిజల్ట్ చూసి మీరే షాక్ అయిపోతారు.

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల మిగిలిపోయిన రైస్( Rice ) వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ), మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు( raw milk ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టీ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ), వన్ టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్( Almond oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని టాన్ అయిన ఫేస్ కు అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై ఒక ఐస్ క్యూబ్ ను తీసుకుని చర్మాన్ని సున్నితంగా ఒకటి లేదా రెండు నిమిషాల పాటు రబ్బింగ్ చేసుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే ఎండ దెబ్బకు నల్లగా కందిపోయిన చర్మం మళ్లీ మునిపటిలా అందంగా మెరుస్తుంది.టాన్ మొత్తం రిమూవ్ అవుతుంది.అలాగే ఈ రెమెడీ చర్మం పై పేరుకుపోయిన డస్ట్, డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది.చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.
కాబట్టి స్కిన్ టాన్ అయిందని బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.