జుట్టు విపరీతంగా రాలిపోతుందా.? రోజురోజుకు జుట్టు పల్చగా మారుతుందా.? హెయిర్ ఫాల్ ( Hair fall )ను అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారా.? అయితే మీకు జామ ఆకులు చాలా బాగా సహాయపడతాయి.జామ ఆకుల్లో అనేక పోషకాలు, ఔషధ గుణాలు నిండి ఉంటాయి.ఆరోగ్యపరంగానే కాకుండా కేశ సంరక్షణకు కూడా జామ ఆకులు తోడ్పడతాయి.నాలుగు జామ ఆకులతో ( guava leaves )ఇప్పుడు చెప్పబోయే విధంగా చేశారంటే జుట్టు రాలనే రాలదు.
ముందుగా నాలుగు జామ ఆకులను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాగా బాయిల్ అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న జామ ఆకులు, రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( fenugreek ), రెండు లవంగాలు ( cloves )వేసి దాదాపు పది నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

గోరువెచ్చగా అయ్యాక ఈ వాటర్ లో వన్ టీ స్పూన్ ఆవనూనె ( Mustard oil )వేసి మిక్స్ చేస్తే మంచి హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.ఈ టానిక్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకుని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకుని మసాజ్ చేసుకోవాలి.గంట ఆనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒకసారి ఈ విధంగా చేశారంటే జుట్టు రాలడం క్రమంగా కంట్రోల్ అవుతుంది.మూలాల నుంచి కేశాలు బలోపేతం అవుతాయి.అలాగే జామ ఆకులతో తయారుచేసిన ఈ టానిక్ హెయిర్ గ్రోత్ ను పెంచుతుంది.జుట్టు దట్టంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.కాబట్టి జుట్టు అధికంగా రాలిపోతుంది అని బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న టానిక్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.








