దేవి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ ప్రేమ.ఆమె ధర్మచక్రం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనప్పటికీ దేవితో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ప్రేమ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.ప్రేమ 1994 నుండి 2009 వరకు 15 ఏళ్ల పాటు నటిగా ఇండస్ట్రీలో రాణించారు.
ఆమె మోహన్ లాల్, విష్ణు వర్థన్, శివరాజ్ కుమార్, ఉపేంద్ర, సాయి కుమార్, మోహన్ బాబు, వెంకటేష్ వంటి స్టార్స్ సరసన నటించిన ప్రేమ ‘దేవి’, ‘దేవిపుత్రుడు’ వంటి భక్తిరస చిత్రాల్లోనూ నటించింది.ఆ తరువాత ఆమె కాలక్రమేపంగా ప్రేక్షకులకు దగ్గరైంది.
అయితే 2006లో ప్రేమ వ్యాపారవేత్త జీవన్ అప్పచును వివాహం చేసుకుంది.ఇక వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో 2016లో విడాకులు తీసుకోని విడివిడిగా ఉంటున్నారు.ఆ తరువాత 2017లో ఉపేంద్ర ‘మత్తే బా’ చిత్రంతో సినిమాల్లోకి సెకండ్ ఇన్సింగ్ స్టార్ చేసింది.ఇక కొంత గ్యాప్ తర్వాత కన్నడలో ఉపేంద్ర పక్కన ‘ఉపేంద్ర మాట్టే బా’ అనే సినిమాలో నటించింది.
ఈ మూవీ 2017లో విడుదలైంది.

ఆమె ‘ఢీ, చిరునవ్వుతో, నువ్వేకావాలి, జానకి వెడ్స్ శ్రీరామ్, ప్రేమతో రా, రాయలసీమ రామన్నచౌదరి’ వంటి పలు సినిమాల్లో నటించారు.ఇక ప్రేమ రెండు తమిళ్, రెండు మలయాళ చిత్రాల్లోనూ కనిపించారు.
అంతేకాక.
చాలా కాలం తర్వాత ప్రేమ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.ఇక ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారని తల్లిదండ్రులు ఒత్తిడి మేరకు ఇంట్లో చూసిన సంబంధం చేసుకునేందుకు 44 ఏళ్ల వయసులో సిద్ధమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.

దాంతో ఆమె పెళ్లిపై వచ్చిన వార్తలపై స్పందించి అవ్వన్నీ రూమర్స్ అని చెప్పుకొచ్చింది.ఇక ప్రస్తుతం తాను ఒంటరిగానే ఎంతో సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది.ప్రేమకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని తేల్చి చెప్పారు.అంతేకాక తన ఆరోగ్యం మీద వస్తున్న వదంతులను నమ్మవద్దని, తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు.