అమెరికాలో(US) అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ప్రభుత్వం దేశం నుంచి బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.వీరితో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని కూడా దేశం నుంచి తరలిస్తున్నారు.
ముఖ్యంగా పలు దేశాలకు చెందిన విద్యార్ధులు దేశ బహిష్కరణను ఎదుర్కోవడం చర్చనీయాంశమైంది.ఇప్పటికే ఓ భారతీయ విద్యార్ధిని తనకు తానుగా సీబీపీ యాప్ ద్వారా స్వచ్ఛందంగా బహిష్కరణ విధించుకున్నారు.
మరో విద్యార్ధి బహిష్కరణపై కోర్ట్ స్టే విధించింది.ముఖ్యంగా కొలంబియా యూనివర్సిటీకి చెందిన విద్యార్ధుల పేర్లు ఈ లిస్టులో వినిపిస్తున్నాయి.
తాజాగా 21 ఏళ్ల యున్సియో చుంగ్ అనే విద్యార్ధిని.ఈ నెల ప్రారంభంలో ఇజ్రాయెల్ (Israel)వ్యతిరేక నిరసనలో పాల్గొన్న సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేశారు.ఇప్పుడు ఆమె మెడపై బహిష్కరణ కత్తి వేలాడుతోంది.ఫెడరల్ అధికారులు తనను బహిష్కరించకుండా ఆపడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(President Donald Trump), ఇతర ఉన్నతాధికారులపై ఆమె కేసు పెట్టినట్లుగా సమాచారం.
మార్చి 5న బర్నార్డ్ అకడెమిక్ బిల్డింగ్ వద్ద జరిగిన ధర్నాలో చుంగ్ ఇతర విద్యార్ధులతో కలిసి పాల్గొనడంతో ఆమెను అధికారులు అరెస్ట్ చేశారు.కొలంబియా అనుబంధ కళాశాల ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శనకారులకు విధించిన శిక్షలను వారు నిరసిస్తున్నారు.
ప్రభుత్వ పరిపాలనను అడ్డుకున్నందుకు గాను చుంగ్‌పై పలు అభియోగాలు మోపారు.

చుంగ్ తన కుటుంబంతో కలిసి దాదాపు 15 ఏళ్ల క్రితం దక్షిణ కొరియా నుంచి అమెరికాకు వచ్చింది.న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.ఆమె చట్టబద్ధమైన శాశ్వత నివాసి.
చుంగ్‌కు లీగల్‌గా పర్మినెంట్ రెసిడెన్సీ స్టేటస్ ఉన్నప్పటికీ .ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ)(Immigration and Customs Enforcement (ICE)) తనను బహిష్కరించేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ ఆమె డొనాల్డ్ ట్రంప్‌పై దావా వేసింది.చుంగ్ తల్లిదండ్రుల ఇంటికి హోంలాండ్ సెక్యూరిటీ విభాగం ఏజెంట్లు ఆమెను వెతకడానికి వెళ్లినట్లు తెలుస్తోంది.చట్టపరమైన పత్రాల ప్రకారం ఐసీఈ చుంగ్‌ను గాలించడంతో పాటు ఆమె నివాసం, యూనివర్సిటీ హాస్టల్‌లో సోదాలు కూడా నిర్వహించింది.