వీర సింహారెడ్డి( Veera Simha Reddy ).ఈ సినిమా ద్వారా తెలుగు తెర పై సరి కొత్తగా కనిపించింది హనీ రోజ్( Honey Rose )… ఆమె గతంలో ఎన్నో సినిమాల్లో నటించిన కూడా రాని పాపులారిటీ ఈ చిత్రం ద్వారా ఆమెకు దక్కింది.
బాలకృష్ణ( Balakrishna ) సరసన యంగ్ లవర్ గా కనిపించిన పాత్రను మాత్రమే జనాలు గుర్తుపెట్టుకున్నారు ఈ చిత్రంలో ఆవిడ ముసలి పాత్రలో కూడా కనిపించిన అందరికీ యంగ్ హనీ రోజ్ మాత్రమే నచ్చింది.అయితే హనీ రోజ్ కి ఇదేమి తెలుగులో తొలి చిత్రం కాదు.
ఆమె ఇదివరకే 15 ఏళ్ల క్రితమే అంటే 2008లో ఆలయం అనే సినిమాలో మొదటిసారి కనిపించింది.ఆ తర్వాత దాదాపు ఆరేళ్లకు ఈ వర్షం సాక్షిగా అనే చిత్రంలో కూడా నటించింది.

అయితే 2005 నుంచి నటిస్తున్న ఆమెకు తెలుగు ప్రేక్షకుల నుంచి ఈ రేంజ్ లో ఆదరణ మునిపెన్నడు దక్కలేదు.మొత్తానికి వీరసింహారెడ్డి హనీ రోజుకి మంచి టర్నింగ్స్ మూవీ గా మిగిలిపోయింది తెలుగులో ప్రస్తుతం ఆమె బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే పలు బ్రాండ్స్ కి హనీ రోజ్ అంబాసిడర్ గా కూడా పనిచేస్తుంది.అయితే వీరసింహారెడ్డిలో మాత్రం మొదటి నుంచి బాలకృష్ణ సరసనా మీనాక్షి పాత్రలో హాని రోజ్ హీరోయిన్ అని సినిమా యూనిట్ అనుకోలేదట.ఆమె పాత్రకు మొదటగా మీరా జాస్మిన్( Meera Jasmine ) ని ఎంచుకున్నారట దర్శకుడు గోపి చంద్ మలినేని.
కానీ మీరా జాస్మిన్ యంగ్ మీనాక్షి పాత్ర వరకు ఓకే కానీ ముసలి మీనాక్షి గా నటించడానికి ఒప్పుకోలేదట.

అందువల్ల మీరా జాస్మిన్ ని ఈ పాత్ర నుంచి తప్పించి హనీ రోజ్ ని సెలెక్ట్ చేశాడు గోపి.ఇలా ఇంత మంచి ఆఫర్ నువ్వు మీరా కాదనుకోవడం వెనక కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ తెలుగులో మరోసారి బ్రేక్ ఇచ్చే మూవీని ఆమె కోల్పోవడం నిజంగా ఆమె అభిమానులను ఒకింత కలవరానికి గురిచేస్తుంది.వీర సింహారెడ్డి సినిమా మాత్రమే కాదు వయసు పైబడిన ఏ పాత్ర వచ్చిన ఆమె తిరస్కరిస్తుందని విషయం ఈ మధ్య బయటకు వచ్చింది మరి మీరా జాస్మిన్ ఇంకా యంగ్ పాత్రల కోసం ఎదురు చూస్తూ ఉండడం ఆశ్చర్యమే.
