ద గ్రేట్ చిరంజీవి.. ఇప్పుడు ఇతర హీరోల మీద ఆధారపడుతున్నారా?

ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి విలన్ పాత్రల నుంచి హీరో పాత్రలకు మారి తన నటనతో డాన్సులతో ప్రేక్షకులందరికీ మెగాస్టార్ గా మారిపోయారు చిరంజీవి.60 ఏళ్ల వయసులో కూడా ఎంతో దూకుడుగా సినిమాలు చేస్తూ అదిరిపోయే డాన్సులు చేస్తూ ఎంతో మంది యువ హీరోలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు అని చెప్పాలి.స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే రాజకీయాల్లోకి వెళ్ళిన చిరంజీవి అక్కడ కలిసి రాకపోవడంతో చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు.

 Chiranjeevi Depends On Other Heros , Chiranjeevi , Chiranjeevi Depends ,khaidi N-TeluguStop.com

Telugu Acharya, Bholashankar, Chiranjeevi, Godfather, Keerthy Suresh, Khaidi, Ra

ఇక రీ ఎంట్రీ సినిమాని బ్లాక్ బస్టర్ సాధించడంతో చిరంజీవి లో గ్రేస్ అయన క్రేజ్ ఎక్కడా తగ్గలేదు అన్నది నిరూపితం అయింది.అయితే ఖైదీనెంబర్150 విజయం సాధించింది కానీ ఆ తర్వాతే చిరంజీవికి అసలు సమస్య మొదలైంది.ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సైరా నర్సింహారెడ్డి అనుకున్నంత విజయం సాధించలేదు.

ఇక ఆ తర్వాత మొన్నటికి మొన్న వచ్చిన ఆచార్య సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది.దీంతో ఇక అందరి చూపు మిగతా సినిమాల పైనే ఉంది.

ఇలాంటి సమయంలో ద గ్రేట్ చిరంజీవి ఇక ఇప్పుడు మిగతా హీరోల మీద ఆధార పడుతున్నారా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది.

Telugu Acharya, Bholashankar, Chiranjeevi, Godfather, Keerthy Suresh, Khaidi, Ra

ఆచార్య లో రామ్చరణ్ చిరంజీవితో కలిసి నటించారు.అయినా ఫలితం తలకిందులైంది.ఇప్పుడు మోహన్ రాజ డైరెక్షన్ లో మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ఖాన్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు.

యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న మెగా 154 సినిమాలో మాస్ మహారాజ రవితేజ ప్రత్యేక పాత్ర చేసేందుకు సిద్ధమయ్యాడు.ఇక మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న భోళాశంకర్ సినిమాలో చిరుతో పాటు ఓ కీలక పాత్రలో మరో స్టార్ హీరో కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

మరో హీరో మాత్రమే కాదు ఇక చిరుకి జోడిగా తమన్నా చెల్లెలి గా కీర్తి సురేష్ నటిస్తున్నారు.దీంతో చిరంజీవి ఇటీవల ఇతర హీరోల మీద ఆధార పడుతున్నారని టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube