మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా పాటించాలి.వాస్తు పద్ధతులు( Vastu ) కూడా లెక్కలోకి తీసుకోవాలి.
వాస్తు ప్రకారం అన్ని సక్రమంగా లేకున్నా కూడా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో పక్కా వాస్తు ప్రకారం ఉంటే ఆరోగ్యం కూడా సరిగ్గా ఉంటుంది.
లేదంటే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.మనం ఆహారం తీసుకునే సందర్భంలో కూడా సరైన దిశలో కూర్చుని ఆహారం తింటేనే ఫలితం ఉంటుంది.
మనం ఎలా కూర్చొని తింటే మంచి లాభాలు ఉంటాయో తెలుసుకుని మరి జాగ్రత్త తీసుకోవడం మంచిది.
ముఖ్యంగా చెప్పాలంటే తూర్పు దిశలో( East ) కూర్చొని తినడం వల్ల ఒత్తిడి,ఆందోళన దూరం అయిపోతాయి.మెదడు ఉత్తేజితం అవుతుంది.తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.
ముసలివారికి, రోగులకు ఇలా భోజనం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది.అందుకే ఎక్కువగా తూర్పు వైపు కూర్చొని తింటేనే మన ఆరోగ్యం మెరుగుపడుతుందని పండితులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే ఉత్తరం వైపు( North ) కూర్చొని ఆహారం తినడం వల్ల డబ్బు, జ్ఞానం, ఆధ్యాత్మికత పెరుగుతుంది.
ఇలా చెయ్యడం వల్ల కెరీర్ పరంగా కూడా పురోగతి లభిస్తుంది.విద్యార్థులు ఉత్తర దిశలో కూర్చొని భోజనం చేయడం వల్ల జ్ఞానం బాగా పెరిగి చదువులో రాణిస్తారు.ఇంకా చెప్పాలంటే పడమర దిశలో కూర్చొని భోజనం చేయడం కూడా ఎంతో మంచిది.
దీని వల్ల సంపదలు, వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి.దక్షిణం దిశలో కూర్చొని భోజనం చేయకూడదు.
ఇది యముడి దిక్కు.కాబట్టి దక్షిణం దిశ అంటే ప్రజలు భయపడతారు.
ఒకవేళ ఈ దిక్కున కూర్చుని భోజనం చేస్తే అనారోగ్య సమస్యలను ఎదుర్కోక తప్పదు.అందుకోసమే వీలైనంతవరకు దక్షిణం వైపు కూర్చొని భోజనం చేయకపోవడమే మంచిది.
DEVOTIONAL