శుభకార్యాలకు వెళుతున్నప్పుడు పిల్లి అడ్డం వస్తే మన పెద్దవారు చేసే హడావిడిని మనం చూస్తూనే ఉంటాం.పిల్లి అడ్డు రాగానే వెనక్కి తిరిగి వచ్చేస్తారు.
అసలు పిల్లి ఎదురు పడితే ఏమవుతుంది.పిల్లి ఎదురు పడే శకునం వెనక ఏ ఉద్దేశం ఉందో తెలుసుకుందాం.
పూర్వకాలంలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లాలంటే ఎడ్ల బండి మీద వెళ్లేవారు.ఆలా వెళ్ళటం వలన ప్రయాణం కూడా బాగా ఆలస్యం అయ్యేది.
అలాగే మధ్య దారిలో అడవులు ఉండేవి.చీకటి కూడా పడేది.
ఆ చీకటి సమయంలో పిల్లి జాతికి చెందిన పులి,సింహాలు ఎదురు పడేవి.వాటిని చూసి ఎడ్లు ముందుకు వెళ్లకుండా ఆగిపోయేవి.
దాంతో కాలక్రమేణా ఆ జాతి జంతువులు ఎదురు పడితే అపశకునంగా భావించటం ప్రారంభం అయింది.
మన భారతదేశంలో పిల్లి శకునాన్ని పాటిస్తారు.
అదే కొన్ని దేశాలలో అయితే పిల్లిని పెంపుడు జంతువుగా పెంచుకొంటారు.