ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.03
సూర్యాస్తమయం: సాయంత్రం 05.40
రాహుకాలం: మ.12.14 నుంచి 01.00 వరకు
అమృత ఘడియలు: ఉ.07.53 నుంచి 09.17 వరకు
దుర్ముహూర్తం: ఉ.06.05 నుంచి 06.45 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈ రోజు మీకిష్టమైన రంగంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి.మిత్రులతో గొడవలు పడే అవకాశముంది.వారిపై ప్రేమతో మెలగడం మంచిది.
మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీనించే అవకాశాలున్నాయి.అలాగే కుటుంబ సభ్యులతో కొంత సమయాన్నిసంతోషంగా గడుపుతారు.
వృషభం:

ఈ రాశి వారు ఈ రోజు కుటుంబంతో సరదాగా, సంతోషంగా గడుపుతారు.అలాగే మీరు అనుకున్న కొన్ని శుభవార్తులు వింటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలి.అథితుల రాకతో ఆనందంగా గడుపుతారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఈ రోజంతా సంతోషంగా గడుపుతారు.
మిథునం:

ఈ రాశి వారు ఈ రోజు దేవుడి సన్నిదిలో ఎక్కువగా గడుపుతారు.తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఏదైనా సాధిస్తారు.మీరు ఇన్నిరోజులుగా కోరుకుంటున్న వస్తువును కొనుగోలు చేస్తారు.
కాని పని కారణంగా కొంచం బిజీగా గడుపుతారు.అనవసర ఖర్చులు చేసే అవకాశం ఉంది.కొంత మంది మంచి వారిని కలవడం వల్ల ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు.
కర్కాటకం:

ఈ రోజు ఈ రాశి వారు ధనలాభం పొందవచ్చు.మీకు ఈ రోజు అదృష్టం మీ తలుపు తడుతుంది.వ్యాపార రంగంలో రాణించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటారు.
మీ పనితనం వల్ల మీ విలువ పెరుగుంది.సమాజంలో మీ పేరు నిలుస్తుంది.
సింహం:

ఈ రోజు మీరేదైనా కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది.ఈ రోజు భవిష్యత్తులో గుర్తింపు తెస్తుంది.రాజకీయ నాయకుల ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.పిల్లలపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ వారి భవిష్యత్తుకు పునాదులు వేస్తారు.మీరు అనుకున్న దాంట్లో విజయం మీ సొంతమవుతుంది.అలాగే మీకిష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు.
కన్య:

ఈ రోజు మీకు ప్రత్యేక రోజవుతుంది.మీరు ఎంచుకున్న రంగంలో మీ పనితనం వల్ల అందరినుంచి ప్రశంసలు అందుకుంటారు.కుంటుంబంతో సంతోషంగా గడుపుతారు.సాధ్యమైనంత వరకు వివాదాలకు, గొడవలకు వెళ్లకపోవడం మంచిది.కుంటుంబంలో ఇన్ని రోజులుగా ఉంటున్న సమస్యలు పరిష్కారమవుతాయి.
తులా:

ఈ రోజు మీరు విజయాలను అందుకుంటారు.ఆదాయ మార్గాలు సుగమం అవుతాయి.మీ వాక్ చాతుర్యంతో సమాజంలో గౌరవం పొందుతారు.
సీజనల్ గా వచ్చే వ్యాధులు బాధించవచ్చు.సాధ్యమైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.
వృశ్చికం:

ఈ రోజు మీరు మీకు నచ్చినట్టుగా పనిచేస్తారు.ఆర్థికంగా స్థిరంగా ఉంటారు.సమాజంలో మీకంటూ సంపద, గౌరవం, కీర్తి ని పెంచుకుంటారు.పెండింగ్ లో ఉన్న అన్ని పనులను పూర్తి చేసుకుంటారు.మీకిష్టమైన వారిని కలుసుకునే అవకాశాలున్నాయి.మీ నోటి దురుసుతో అందర్ని బాధపెడతారు.కోపాన్ని కంట్రోల్ ఉంచుకోకపోతే నష్టం వాటిళ్లే అవకాశముంటుంది.
ధనస్సు:

కుటుంబ అవసరాల కోసం అధిక ఖర్చు చేస్తారు.రాబడి పెరిగే అవకాశాలున్నాయి.మీరు చేస్తున్న పనికి తగిన వేతనం పొందుతారు.
ఇతరుల కారణంగా సమస్యలు ఎదుర్కొని ఒత్తిడికి గురవుతారు.ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది.
మకరం:

వ్యాపారాల్లో విజయం మీ సొంతం చేసుకుంటారు.ఫలితంగా ఆనందంగా ఉంటారు.ఆర్థిక లావాదేవీల్లో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
వ్యాపార రంగంలో సరైన నిర్ణయాలను ఎంచుకుంటే మంచిది.పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు విజయం అందుకుంటారు.
కుంభం:

ఈ రోజు మీకు అనుకోకుండా లాభం పొందుతారు.నష్టాన్ని కూడా భరించే అవకాశాలున్నాయి.ఆకస్మిక అనారోగ్యం కారణంగా అధిక ఖర్చులు చేస్తారు.ఏదానా విక్రయించేటప్పుడు చట్టపరమైన అంశాలను గుర్తించుకోవాలి.జీవిత భాగస్వామితో ఆరోగ్యంగా గడుపుతారు.
మీనం:

మీ వైవాహిక జీవితంతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు.ఫలితంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.స్వల్ప ప్రయాణాలు చేసే అవకాశముంటుంది.
వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు.విద్యార్థులపై భారం తక్కువగా ఉండే అవకాశముంది.
తల్లిదండ్రుల ఆశీర్వాదాలు అందుకుంటారు.