ముఖ్యంగా చెప్పాలంటే ఏ దేవుని దేవాలయమైన సంవత్సరం పొడవునా తెరిచి ఉంటుంది.ప్రతి రోజు దేవాలయంలో ఉదయాన్నే పూజలు, అభిషేకాలు, నైవేద్యాలు, అర్చనలు జరుగుతూ ఉంటాయి.
భక్తులు కూడా పెద్ద ఎత్తున స్వామి వారి దేవాలయానికి వస్తుంటారు.సోమవారాలు,గురువారాలు, శుక్ర, శనివారాలలో భక్తులు దేవాలయానికి పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు.
కానీ కొన్ని ఆలయాలలో మాత్రం ఏదైనా గ్రహణ సమయం( Eclipse time ) లేదా చాలా అరుదుగా ఆలయం మూసి వేయడం లాంటివి జరుగుతుంటాయి.కానీ ఆ తర్వాత తిరిగి యధాతధంగా దేవాలయంలో ప్రతిజ్ఞ శుద్ధి కార్యక్రమాలు చేపట్టి పూజలు నిర్వహిస్తూ ఉంటారు.

కర్ణాటక రాష్ట్రంలోని విజయపురలో( Vijayapura in Karnataka state ) నీడగుండి సమీపంలోని అడకల్ గుండప్ప సన్నిధి లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది.ఈ దేవాలయంలో ఒక చేతిలో గొడుగు పట్టుకుని వస్తున్న భక్తులు, తలపై ప్రసాదాల బుట్టలతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న మహిళలు, పచ్చనీ వాతావరణం లో ఎందరో భక్తులు కూడా వస్తూ ఉంటారు.ఈ భక్తులందరూ సుక్షేత్రం యలగూరు గ్రామానికి( Yalaguru village ) చెందిన వ్యక్తులు.పూర్వం గ్రామంలోని భక్తులంతా ఒకే చోట చేరి పల్లకిని ఎత్తుకొని తిరుపతికి ప్రతి సంవత్సరం తీర్థ యాత్రలకు వెళ్ళవారు.
భక్తుల కష్టాలు తెలుసుకున్న తిరుపతి తిమ్మప్ప స్వయంగా ఇకనుంచి మీరు తిరుపతి క్షేత్రానికి రావద్దని కోరినట్లు ఆ గ్రామ ప్రజలు చెబుతున్నారు.

అందుకే అప్పటి నుంచి ఈ భక్తులు తిరుపతికి వెళ్లడం మానేశారు.ఈ కొండపై కనిపించే ఏకశిలలో వందేళ్ల క్రితం వెంకటరమణ లక్ష్మీ మూర్తి ( Venkataramana Lakshmi Murthy )కొలువై ఉన్నారు.ఇక్కడ ప్రతి ఏడాది శ్రావణ మాసం మూడో సోమవారం ఒక్కరోజు మాత్రమే అడకల్ గుండప్ప సన్నిధి తలుపులు తెరిచి ఉంటాయి.
ఈ సమయంలో ఎంతో మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.ఈ సన్నిధిలో కుల, మత, ధనిక, పేద, చదువుకున్న వారు అనే తేడా అసలు ఉండదు.
ఇంట్లో మహిళలు చేసిన నైవేద్యాలను ఇక్కడికి తీసుకొచ్చి భగవంతుడికి నైవేద్యంగా పెట్టి తినిపించే సంప్రదాయం తరతరాలుగా ఇక్కడ ఉంది.