ఐదు రోజుల్లో నిజామాబాద్ కు పసుపు బోర్డు( Turmeric Board ) తీసుకువస్తానని 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రైతులకు వాగ్దానం చేయడంతో పాటు, బాండ్ పేపర్ మీద హామీని రాసిచ్చిన నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింధ్( MP Dharmapuri Aravind ) ఇప్పటికీ ఆ హామీని నెరవేర్చకపోవడంతో , ఆయనకు అనేక సందర్భాల్లో రైతుల నుంచి నిరసన సెగ తగిలిన సంగతి తెలిసిందే.బీఆర్ఎస్ , కాంగ్రెస్ లపై అరవింద్ విమర్శలు చేసిన ప్రతి సందర్భంలోనూ.
పసుపు బోర్డు అంశం తెరపైకి వస్తోంది.పసుపు బోర్డు వ్యవహారంపై రైతులు తో పాటు, బీఆర్ఎస్ , కాంగ్రెస్ లు అరవింద్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే వస్తున్నాయి.
ఇక నిజామాబాద్ జిల్లాకు( Nizamabad ) పసుపు బోర్డు అరవింద్ తీసుకురావలేరనే అభిప్రాయానికి వచ్చిన ఈ ప్రాంత రైతులు ఇప్పుడు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు.నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున పసుపు రంగు బోర్డులను ఏర్పాటు చేసి, మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు అంటూ వినూత్నంగా నిరసన తెలుపుతుండడం సంచలనంగా మారింది.
ఇటీవల పార్లమెంటు వేదికగా పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్రం వెల్లడించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకువస్తానని ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ మీద రాసిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ విధంగా వినూత్న నిరసన చేపట్టారు.పసుపు బోర్డు తీసుకొస్తానని ఎంపీ అరవింద్ మాత్రమే కాదు,
బిజెపి అగ్రనేతలు రాజనాథ్ సింగ్ , రామ్ మాధవ్ వంటి వారు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.కానీ అది కార్యరూపం దాల్చలేదు.పైగా పసుపు బోర్డ్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలేదని కేంద్రం తెల్చేయడంతో పసుపు రంగు బోర్డుల ఏర్పాటు ద్వారా వెటకారపు నిరసనకు రైతులు దిగారు.వీరు ఏర్పాటు చేసిన పసుపు రంగు బోర్డు లు అందరినీ ఆకర్షిస్తూ ఉండగా, అరవింద్ తో పాటు, బీజేపీ నీ ఇరకాటంలో పడేశాయి.