తెలుగులో కమెడియన్ అలీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న విషయం తెలిసిందే.పలు సినిమాల్లో కమెడియన్ పాత్రల్లో నటించిన అలీ, యమలీల సినిమాతో హీరోగా మారాడు.
ఇటు బుల్లితెరపై కూడా యాంకరింగ్ చేస్తూ దూసుకుపోతున్న అలీ ఇంట విషాదం నెలకొంది.
అలీ తల్లి జైతున్ బీబీ తన స్వస్థలం అయిన రాజమహేంద్రవరంలో గురువారం కన్నుమూశారు.
గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కన్నుమూసినట్లు తెలుసుకున్న అలీ వెంటనే తన కార్యక్రమాలు అన్నీ రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు.షూటింగ్ కోసం రాంచీ వెళ్లిన అలీ తమ మాతృమూర్తి మరణవార్తతో హైదరాబాద్ చేరుకున్నాడు.
కాగా జైతున్ మృతదేహాన్ని అలీ కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించే పనిలో ఉన్నారు.
అలీ మాతృవియోగం గురించి తెలుసుకున్న తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అలీ ఇంటికి చేరుకున్నారు.
అలీ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వారు తెలిపారు.కాగా అలీ తల్లి అంత్యక్రియలు హైదరాబద్‌లో నిర్వహించాలని కుటంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.