ఇవి తింటున్నారా..? అయితే బరువు తగ్గడం కష్టమే..!

నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు కొవ్వును దూరం చేసుకోవాలంటే అల్పాహారం అత్యంత భారీగా ఉండాలి.బరువు తగ్గడానికి మీకు ఉపయోగపడే కొన్ని ఆహారాలతో మీరు రోజును మొదలుపెట్టాలి.

 Foods To Avoid To Lose Weight,weight Gain,weight Loss,tea With Biscuits,cookies,-TeluguStop.com

కాబట్టి చాలామంది అల్పాహారం కోసం కొంత ఆహారం తీసుకుంటూ ఉంటారు.తర్వాత ఏదేదో తింటూ ఉంటారు.

దీని వలన బరువు నియంత్రణకు బదులుగా శరీరంలో కొవ్వు పెరుగుతూ ఉంటుంది.వెంటనే ఈ ఆహారాలను తొలగించడం ఎంతో ముఖ్యం.

బిస్కెట్లు లేదా కుకీలు వంటి బేకరీ వస్తువులు తినడానికి చాలా బాగుంటాయి.కానీ కొవ్వులు ప్రాసెస్ చేసిన పదార్థాలు చక్కెర కలిగి ఉంటాయి.

Telugu Fried Items, Sweets, Tea Biscuits-Telugu Health

ఈ ఆహారాలు తినడం వల్ల అధిక బరువు పెరుగుతారు.ఇలా అధిక బరువు పెరగడం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.చాలామంది ఉదయం పూట ఒక కప్పు టీ లేదా కాఫీతో బిస్కెట్లు తింటూ ఉంటారు.కుకీలు, మిఠాయిలు, చక్కెర తృణధాన్యాలు కేలరీలు అధికంగా ఉంటాయి.వీటిని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర పెరగడంతో పాటు బరువు కూడా పెరుగుతారు.పరోటాలను చాలా ఇండ్లలో అల్పాహారం గా తీసుకుంటూ ఉంటారు.

కూరగాయలు, గోధుమ పిండితో చేసిన పరోటా ఆరోగ్యానికి మంచిది.

Telugu Fried Items, Sweets, Tea Biscuits-Telugu Health

కానీ పరోటాను వెన్న, పచ్చడ్లతో కలిపి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఇది శరీరంలో బరువు పెరగడానికి కారణం అవుతుంది.ప్రతిరోజు చిప్స్ వేయించిన స్నాక్స్ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల బరువు పెరుగుతారు.

ఈ ఆహారం అధిక కేలరీలను కలిగి ఉంటాయి.ఇంకా చెప్పాలంటే బరువు తగ్గడానికి తాజా కూరగాయలు, పండ్లు అవసరమవుతాయి.

పండ్లు బరువు తగ్గడమే కాకుండా వివిధ వ్యాధుల నుంచి కూడా మనల్ని రక్షిస్తాయి.బరువు తగ్గాలనుకున్నప్పుడు మార్కెట్లో లభించే డ్రింక్స్ అసలు తీసుకోకూడదు.

ఇందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది.చక్కెర లేని ఆహారాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడం సులువుగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube